Inter Exam Evaluation: రేపే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం..!
ఏలూరు: ఇంటర్మీడియెట్ కెమిస్ట్రీ, హిస్టరీ జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 26 నుంచి ప్రారంభించాల్సి ఉండగా ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి ఆదేశాల మేరకు ఈనెల 25న సోమవారం నుంచే ప్రారంభించనున్నట్లు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల కన్వీనర్ బి.ప్రభాకరరావు ప్రకటనలో తెలిపారు.
Gurukul Admissions: ఈ నెల 31లోగా గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.
మూల్యాంకన శిబిరం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందన్నారు. ఏలూరు జిల్లాలోని ప్రతి కళాశాల నుంచి కెమిస్ట్రీ, హిస్టరీ సబ్జెక్టులకు నియమించిన ఎగ్జామినర్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తప్పనిసరిగా ఈ శిబిరానికి హాజరయ్యేలా రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఎగ్జామినర్లు సోమవారం ఉదయం 10 గంటలకు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
TS Tenth Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాల తనిఖీ..
అలాగే కెమిస్ట్రీ, హిస్టరీ సబ్జెక్టులకు స్కూృటినైజర్స్‌గా నియమించిన సిబ్బందిని సైతం సదరు శిబిరంలో ఈనెల 26న మంగళవారం రిపోర్ట్ చేయాలని సూచించారు. రిపోర్ట్ చేయని ఒక్కో ఎగ్జామినర్‌కు రోజుకు రూ.1,000 చొప్పున కళాశాల యాజమాన్యానికి జరిమానాగా విధించాలని పేర్కొన్నారు.
AP POLYCET 2024: పాలిసెట్-2024 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?