TS SSC 10th Results 2024 Live Updates : టెన్త్‌లో ఈసారి 91.23% ఉత్తీర్ణత.. ఫ‌స్ట్‌.. లాస్ట్ జిల్లాలు ఇవే..

TS SSC 10th Results 2024 Live Updates :

  • టెన్త్‌ ఫలితాల్లో మొత్తం 91.23% ఉత్తీర్ణత
  • ఫలితాల్లో బాలికలదే పైచేయి
     
  • 89.42%- బాలురి ఉత్తీర్ణత శాతం
  • 93.23%- బాలికల ఉత్తీర్ణత శాతం
  • పరీక్షలు రాసిన 5 లక్షల 8వేల 385 మంది విద్యార్థులు
     
  • 3927 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత
  • 99% ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా టాప్‌ ప్లేస్‌
  • వికారాబాద్‌లో అత్యల్పంగా 65.10% ఉత్తీర్ణత

ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూసున్న తెలంగాణ టెన్త్‌ ఫలితాలు వచ్చేశాయి.  విద్యా శాఖ కమిషనర్‌ బుర్రా వెంకటేశం ఉద‌యం 11:00 గంట‌ల‌కు ఫలితాలను ప్రకటించారు. టెన్త్‌ ఫలితాల్లో మొత్తం 91.23 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలవగా, 65.10శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ ప‌రీక్ష‌లు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

TS 10th Class Results Released: పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి.. వేగంగా ఇలా చెక్‌ చేసుకోండి

మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగా.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది.

ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి.https://results.sakshieducation.com/ 

#Tags