Basara IIIT Counseling 2024: బాసర ట్రిపుల్‌ఐటీలో ముగిసిన కౌన్సెలింగ్.. ఆగస్టులో తరగతులు
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసింది. మూడో రోజు బుధవారం 404మంది విద్యార్థులకు గాను 35మంది గైర్హాజరయ్యారు. 1001 నుంచి 1404 సంఖ్య వరకు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని అకాడమిక్ బ్లాక్‌లో విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు.కరీంనగర్ జిల్లాకు చెందిన మీనకు మొదటి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఆరేళ్ల సమీకృత విద్యావిధానం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా విడుదల చేసి కౌన్సెలింగ్ పూర్తి చేశారు.
ఆగస్టు మొదటి వారంలో విద్యార్థుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రెండో వారంలో తరగతుల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, 1404 మందిని కౌన్సెలింగ్‌కు పిలువగా.. మూడు రోజుల్లో మొత్తంగా 106మంది గైర్హాజరయ్యారు.
మిగిలిన సీట్లు రెండో విడతలో భర్తీ
మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేస్తామని జాయింట్ కన్వీనర్ డాక్టర్ పావని తెలిపారు. త్వరలో పీహెచ్‌సీ, ఎన్‌సీసీ, క్యాప్, స్పోర్ట్స్ తదితర కోటాలో సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. గ్లోబల్ కోటా సీట్లను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు. జాయింట్ కన్వీనర్లు రంజిత్‌కుమార్, డాక్టర్ దత్తు, అడ్మిషన్ కమిటీ సభ్యులు హరికృష్ణ, డాక్టర్ కుమార్‌రాఘుల, శ్రీకాంత్, రాకేశ్‌రెడ్డి, అధ్యాపకులు శంకర్, డాక్టర్ కమల, తదితరులు పాల్గొన్నారు.
Tags
- counselling
- IIIT Counselling
- AP IIIT Counselling
- basara iiit admissions
- Basara IIIT
- Academic year 2024-25 counseling
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024
- sakshieducation latest admissions in 2024
- iiit basara latest news
- RGUKT Basara
- IIIT
- SakshiEducationUpdates
- first round of counseling for the admissions
- Academic year 2024-25
- Nirmal District