Skip to main content

AP RGUKT IIIT Selection List 2024 Released: ఏపీ ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల.. టాప్‌ 20 టాపర్స్‌ లిస్ట్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ ప్రవేశ పరీక్ష (AP RGUKT 2024) ఫలితాలు విడుదల అయ్యాయి. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల జాబితాను అధికారులు నేడు(గురువారం) రిలీజ్‌ చేశారు.
AP RGUKT IIIT Results 2024  AP RGUKT 2024 Results Announcement  Andhra Pradesh RGUKT 2024 Exam Results  AP RGUKT Entrance Examination Results 2024

రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2024–25 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మే 6న నోటిఫికేషన్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే.

NIT Warangal Campus Placements: ఈ ఏడాది రూ. 88 లక్షల ప్యాకేజీ.. క్యాంపస్‌ సెలక్షన్‌లో అదరగొడుతున్న నిట్‌ విద్యార్థులు

నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉండగా, ఈ ఏడాది 53,863 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో సీటుకు దాదాపు 13 మంది పోటీ ప‌డుతున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారిలో ప్ర‌భుత్వ స్కూల్స్ నుంచి 34,154 మంది, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 19,671 మంది విద్యార్థులు ఉన్నారు.

అయితే పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్‌ అనుసరించి ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ సీట్ల‌ను ఏపీ, తెలంగాణ విద్యార్థుల‌కు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు.

Software Engineer Jobs: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!..ఈ రంగాల్లో ఇంజనీర్లకు భారీగా డిమాండ్‌

ఇందులో ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కులతో పాటు ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. అలాగే ఆర్థికంగా వెనున‌క‌బ‌డిన సామాజిక వ‌ర్గాల‌కు 100 సీట్లు కేటాయిస్తారు. ఇత‌ర రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు 25 శాతం సూప‌ర్ న్యూమ‌రీ కింద సీట్లు కేటాయిస్తారు. 

AP RGUKT IIIT Results 2024.. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://admissions24.rgukt.in/ను క్లిక్‌చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న సెలక్షన్‌ లిస్ట్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • తర్వాతి పేజీలో ఐఐఐటీలకు ఎంపికైన విద్యార్థుల జాబితా కనిపిస్తుంది. 
  • మీరు ఎంపికైన క్యాంపస్‌లను బట్టి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరు అవ్వండి. 

 

AP RGUKT IIIT Selection List 2024 : ఏపీలోని ట్రిపుల్ ఐటీ ఎంపిక జాబితా విడుద‌ల తేదీ ఇదే..! స‌ర్టిఫికేట్ వెరిపికేషన్ తేదీలు ఇవే..

 

AP RGUKT IIIT Admissions 2024 Certificate Verification Schedule:

S.No

Event Date Venue
1 Certificate Verification for candidates selected for RGUKT, Nuzvid Campus 22-7-2024 and 23-7-2024 RGUKT-Nuzvid Campus, Eluru Dist
2 Certificate Verification for candidates selected for RGUKT, R.K Valley Campus 22-7-2024 and 23-7-2024 RGUKT-RK Valley Campus, Idupulapaya, Kadapa Dist
3 Certificate Verification for candidates selected for RGUKT, Ongole Campus 24-7-2024 and 25-7-2024 RGUKT-RK Valley Campus, Idupulapaya, Kadapa Dist
4 Certificate Verification for candidates selected for RGUKT, Srikakulam Campus 26-7-2024 and 27-7-2024 RGUKT-Srikakulam Campus, Etcherla
5 Reporting to the respective campuses Will be intimated separately -
Published date : 11 Jul 2024 06:28PM
PDF

Photo Stories