10th Class Exam Pattern: ఈ ఏడాదికి టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులు
ఇప్పటివరకు ఇస్తున్న 20 ఇంటర్నల్ మార్కులు ఎత్తేస్తూ వంద మార్కులకు టెన్త్ పేపర్ ఉంటుందని నవంబర్ 28న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది వరకు పాత పద్ధతినే కొనసాగిస్తామని తెలిపింది.
చదవండి: ఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
2025–26 విద్యాసంవత్సరం నుంచి మారి న విధానం అమలు చేస్తామని స్పష్టం చేసింది. అంటే ఎప్పటిలాగే ఈసారి కూడా 20 ఇంటర్నల్ మార్కులు ఇస్తారు. టెన్త్ పేపర్ సైతం ఈసారికి 80 మార్కులకు ఉంటుంది. ఈ రెండు ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. అన్ని పాఠశాలల్లో ఇప్పటికే ఫార్మెటివ్, సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు జరిగాయి.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
పరీక్షల విధానంలో మార్పులుంటే విద్యా సంవత్సరం ముందే చెప్పాలని... పరీక్షలు 2 నెలలు ఉండగా ఇప్పుడు మార్పులు చేయడం ఏమిటని విద్యా ర్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులను సవరించినట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది.