Teachers Forum: సైన్స్ ఉపాధ్యాయులతో గణిత బోధన సరికాదు
జూన్ 5న వారి ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపి.. అనంతరం డీఈఓ ఇందిరను కలిసి వినతి పత్రం అందజేశారు. సైన్స్ ఉపాధ్యాయులు గణిత బోధించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వలన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: Education: బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి
సైన్స్ యాక్టివిటీ అయిన ఇన్‌స్పైర్ అవార్డులు, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్ తదితర ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం కష్టమవుతుందని వాపోయారు. 20 శాతం గణిత ఉపాధ్యాయులు అదనంగా పనిచేస్తున్నప్పటికి... తమపై అదనపు బాధ్యతలు మోపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఫోరం నాయకులు తిమ్మారెడ్డి, గౌరీశంకర్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, భీమన్న, భాస్కర్‌పాపన్న, క్రాంతికుమార్, జయరాజు, జగన్నాథం, అక్షిత్ పాల్గొన్నారు.