Skip to main content

Education: బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌: బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని డీఈవో అశోక్‌ అన్నారు.
Badidu children should be enrolled in schools

జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మే 31న‌జిల్లాలోని ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ జూన్‌ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. బడీడు, బడి బయట, బడి మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు.

చదవండి: CBSE Syllabus: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భ‌విష్య‌త్తు..

గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జూన్‌ 3 నుంచి 11 వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.

జూన్‌ 19 వరకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బడిబాట కార్యక్రమం, ఆ తర్వాత పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు. అనంతరం హెచ్‌ఎంలకు తేదీల వారీగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్‌ మధుకర్‌, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Published date : 03 Jun 2024 11:00AM

Photo Stories