Tenth Advanced Supplementary: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల సన్నద్ధం కోసం ఆదేశాలు జారీ..!
భువనగిరి: ఉపాధ్యాయులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పరీక్షలకు సమయం ముంచుకొస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల విడుదల చేసిన పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. మొత్తం 9,108 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఏప్రిల్ 30 వెల్లడించిన ఫలితాల్లో 8,237 మంది (90.44 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
Skill Development Centers: కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు..!
ఏ ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 69 శాతం మంది మాత్రమే పాసయ్యారు. వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఫలితాలు ప్రకటించిన రోజునే సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉంది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిమగ్నం అయ్యారు. దీంతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేవారు లేక విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Development in Education System: సీఎం జగన్ పాలనలో విద్యాభివృద్ధి.. పేద విద్యార్థుల చదువు కోసం..!
1,570 మంది ఫెయిల్
వార్షిక పరీక్షల్లో మొత్తం 1,570 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో సుమారు 565 మంది అనుత్తీర్ణులయ్యారు. సామాన్య శాస్త్రం, గణితంలో కూడా పెద్ద సంఖ్యలోనే ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వారికి పాఠశాలల్లో ఇప్పటికే ప్రత్యేక తరగుతులు ప్రారంభించాల్సి ఉంది. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా సప్లిమెంటరీలో పాస్ మార్కులు సాధించేలా సన్నద్ధం చేయించాలి.
Facilities at School: పాఠశాలల పునఃప్రారంభం నాటికి మరమ్మతుల పని పూర్తి కావాలి!
సెన్స్‌లో ఎక్కువగా..
గత విద్యా సంవత్సరం సామాన్య శాస్త్రం పరీక్ష పేపర్–1, పేపర్–2 పరీక్షలను ఒకే రోజు నిర్వహించారు. దీంతో సైన్స్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ విద్యా సంవత్సరంలో సైన్స్ పేపర్–1, పేపర్–2ను వేర్వేరు రోజుల్లో నిర్వహించారు. అయినా సామాన్య శాస్త్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు తప్పారు.
Mikhail Mishustin: రష్యా ప్రధానమంత్రిగా తిరిగి నియమితులైన మిఖాయిల్ మిషుస్టిన్
ఫెయిల్ అయిన విద్యార్థులు ఇలా..
తెలుగులో 324, హందీ 28, ఇంగ్లిష్ 213, గణితం 394, సైన్స్ 349, సాంఘిక శాస్త్రంలో 72 మంది ఫెయిల్ అయ్యారు.
ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాం
పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని ప్రభుత్వ పాఠశాలల ప్రధానాపోధ్యాయులు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేలా సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులను అందుబాటులో ఉండాలని సూచించాం. ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేస్తాం.
– నారాయణరెడ్డి, డీఈఓ