Teachers: ఉపాధ్యాయులు లేక పాఠశాలకు తాళం

అయిజ: మండలంలోని తొత్తినోనిదొడ్డి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు టీచర్లను నియమించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సెప్టెంబ‌ర్ 26న‌ పాఠశాలకు తాళం వేసి ధర్నా నిర్వహించారు.

ఈసందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: Teachers Adjustment: టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి

ఒక ఉపాధ్యాయుడు కాంప్లెక్స్‌ మీటింగ్‌కు వెళ్తే పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారని వాపోయారు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారని మండిపడ్డారు. మొత్తం ఏడు తరగతులకు ఏడుగురు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ధర్నా విషయం తెలుసుకున్న ఎంఈఓ దయాల్‌ రాములు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం తిమ్మారెడ్డి అక్కడికి చేరుకొని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి పాఠశాలకు వేసిన తాళం తీయించారు. ఆ పాఠశాల నుంచి రిలీవ్‌ అయిన ఒక ఉపాధ్యాయుడితో మాట్లాడి తొత్తినోనిదొడ్డి పాఠశాలలోనే మరికొంత కాలం పనిచేసే విధంగా కోరారు.

#Tags