Courage for Students: పరీక్షల సమయంలో టెన్త్‌ విద్యార్థులకు అవగాహన కల్పించాలి..

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి వెంకటయ్య తెలిపారు.

సాక్షి ఎడ్యుకేషన్‌: నెల్లూరులోని మద్రాసు బస్టాండ్‌ సమీపంలో ఉన్న బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో శనివారం సహాయ బీసీ సంక్షేమ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 58 ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో 631 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారని, వారికి పరీక్షలపై భయం పోయేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతోపాటు మెటీరియల్‌ అందజేస్తున్నామన్నారు.

Teachers Transfer: బదిలీలు లేకుండానే పాఠశాలల్లో కొత్త టీచర్లు.. ఇదే కారణమా..!

విద్యార్థులను మూడు గ్రేడ్‌లుగా విభజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా గ్రూప్‌–2 కోచింగ్‌, మెటీరియల్‌ పంపిణీ సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం యశస్వి మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితాను ఆయా విద్యాసంస్థల హెచ్‌ఎం, ప్రిన్సిపల్స్‌ ఈ నెల 10వ తేదీ లోపు తమ కార్యాలయానికి పంపాలని తెలిపారు.

Nursing Colleges: నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుకు వినతీ పత్రం

దరఖాస్తుతోపాటు ఓబీసీ, ఇన్‌కం సర్టిఫికెట్లు, మార్కుల జాబితా, బ్యాంక్‌ పాస్‌బుక్‌, ఆధార్‌, ఆయా విద్యాసంస్థల ఫీజు రిసిప్ట్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. కులగణన కార్యక్రమంలో బీసీ అధికారులు, వార్డెన్లు పాల్గొనాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంలో అలసత్వం వహించే వార్డెన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నెల్లూరు, కావలి, కందుకూరు, ఆత్మకూరు, ఉదయగిరి సహాయ బీసీ సంక్షేమ అధికారులు లక్ష్మీప్రసూన, శ్రీదేవి, తేజోవతి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

#Tags