Nursing Colleges: నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు వినతీ పత్రం
తిరువళ్లూరు జిల్లాలోని పూందమల్లి, ఆవడి, గుమ్మిడిపూండి, తిరుత్తణి ప్రాంతాల్లో రూ.3.77 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నర్సింగ్ కళాశాల, బ్లడ్‌బ్యాంకు పరిశోధన కేంద్రం, తిరువళ్లూరు జిల్లా మెడికల్ కళాశాల వైద్యశాలలో ఏర్పాటు చేసిన అత్యవసర చికిత్స విభాగాన్ని ప్రారంభించే కార్యక్రమం కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాణిపేట గాంధీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం హాజరయ్యారు. భవనాలను ప్రారంభించి మాట్లాడారు.
Teachers Transfer: బదిలీలు లేకుండానే పాఠశాలల్లో కొత్త టీచర్లు.. ఇదే కారణమా..!
ప్రభుత్వ వైద్యశాలలో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రోజుకు రెండు వేల నుంచి ఐదు వేల మంది వరకు జిల్లా వైద్యకేంద్రానికి వస్తున్నట్టు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. రోగులు, ప్రసవాలు పెరగడానికి వైద్యశాలలో అందుతున్న సదుపాయాలే నిదర్శనమన్నారు. కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, తిరుత్తణి చంద్రన్, డీన్ రేవతి, వైద్యులు రాజ్‌కుమార్, ప్రభుశంకర్, జగదీశన్ పాల్గొన్నారు.