Teachers Association: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఎదులాపురం: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు.
ఈ మేరకు ఆర్డీవో స్రవంతికి జూలై 31న వినతిపత్రం అందజేశారు. ‘ఉపాధ్యాయ ఉద్యమ జాగరణ’ పేరిట తపస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పీఆర్సీ కమిటీ వేసి మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, పండిత్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్‌తో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఇందులో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, గోపీకృష్ణ, నాయకులు గోపాలకృష్ణ, వెంకట రమణారెడ్డి, జాదవ్ రాంజీ పాల్గొన్నారు.
చదవండి:
#Tags