Department of Education: బడిలో ఎకో క్లబ్‌లు

కెరమెరి(ఆసిఫాబాద్‌): పుడమి తల్లిని రక్షించుకోవ డం అందరి బాధ్యత.. ప్రతిఒక్కరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.

పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ, ‘సమగ్ర శిక్ష’ ఆధ్వర్యంలో సంయుక్త కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పర్యావరణ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటి ఆధ్వర్యంలో జూన్ 15 నుంచి 24 వరకు రోజువారీ కార్యకలాపాలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘మేరి లైఫ్‌’ పథకంలో భాగంగా ఈ ఏడాది ‘పర్యావరణ దినోత్సవం– భూమి పునరుద్ధరణ’ పేరుతో కార్యక్రమాలను ప్రకటించారు. శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పర్యావరణ కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు.

చదవండి: Agriculture Polytechnic: అగ్రి కోర్సులతో కచ్చితమైన ఉపాధి.. తక్కువ ఫీజుకే నాణ్యమైన వ్యవసాయ విద్యా కోర్సులు

ఏడు రోజులపాటు నిర్వహణ

జిల్లాలో మొత్తం 740 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. ఇందులో 45 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ బడుల్లో ఎకో క్లబ్‌ల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ఏడు రోజులపాటు నిర్వహించనున్నారు.

ప్రతిరోజూ ఒక్కో అంశం ఆధారంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనిపై అన్ని పాఠశాలలకు ఇప్పటికే మార్గదర్శకాలు అందించారు. సంబంధిత ఫొటోలు, వీడియోలను https://merilife.nic.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. పాఠశాల, మండల స్థాయిలో పంచాయతీరాజ్‌, వ్యవసాయ, అటవీ శాఖల సమన్వయంతోపాటు ఎన్‌జీవోలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేయాలి.

మొక్కలకు పేర్లు..

పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాల్లో నిర్వహించే కార్యక్రమాలపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఏటా హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల్లో మొక్కలు నాటుతున్నారు. అయితే వాటి ఆలనాపాలన చూసేవారు లేకపోవడంతో చెట్లుగా ఎదగడం లేదు. ప్రస్తుతం బడుల్లో చేపడుతున్న కా ర్యక్రమాల్లో భాగంగా ప్రతీ విద్యార్థి ఒక మొక్క నా టి, దానికి తన తల్లి పేరు పెట్టి పోషించాలని అధి కారులు చెబుతున్నారు.

చదవండి: Pixxel to Launch Six Satellites: ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్న స్టార్టప్‌ సంస్థ

మొక్కను తల్లిలా భావించి కాపాడితే కార్యక్రమం విజయవంతం అవుతుందని పేర్కొంటున్నారు. ఖాళీ స్థలాలను మాత్రమే ఈ కార్యక్రమానికి ఉపయోగించుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.సూచిస్తున్నారు. ప్రతీ పాఠశాలలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

వ్యాసరచన పోటీలు

పర్యావరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థి కి తెలిసిన ఏదైనా ఒక్క చెట్టుపై ప్రత్యేక వ్యాసం రా యాల్సి ఉంటుంది. జిల్లాలో అడవులు అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఆదివాసీలకు అడవులతో ప్రత్యేక అనుబంధం ఉంది.

ఈ నేపథ్యంలో ఈ పోటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లాస్థాయి అధికారులు ప్రధానోపాధ్యాయులకు సూచనలిచ్చారు. వ్యాసానికి సంబంధించిన ఫొటోతోపా టు వీడియోను కూడా సంబంధింత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే జాతీయస్థాయిలో గుర్తింపు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

విద్యార్థులకు అవగాహన

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. వారం రోజులకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా నిర్వహిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కార్యక్రమానికి సంబంధించిన విషయాలపై గూగుల్‌ మీట్‌లో ప్రధానోపాధ్యాయులకు వివరించాం. అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు యువజన సంఘాలు, ఎన్‌జీవోల సమన్వయంతో పని చేయాలి.
– ఉప్పులేటి శ్రీనివాస్‌, జిల్లా క్వాలిటీ కోఆర్టినేటర్‌


జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు

రోజువారీ కార్యక్రమాలు

ఒకటో రోజు: ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవడం (అడాప్ట్‌ హెల్తీ లైఫ్‌).

రెండో రోజు: సుస్థిరమైన ఆహార వ్యవస్థను నిర్వహించడం.

మూడో రోజు: ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు తగ్గించడం

నాలుగో రోజు: వ్యర్థ పదార్థాల నిర్వహణ.

ఐదో రోజు: శక్తి వనరులను సంరక్షించడం.

ఆరో రోజు: నీటి వనరులను సంరక్షించడం.

ఏడో రోజు: సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ను అరికట్టడం.

#Tags