‘SGTలకు సర్వే విధులు కేటాయించొద్దు’

నిర్మల్‌ఖిల్లా: ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యను బలహీన పర్చేలా ఎస్జీటీలకు కుల గణన విధులు కేటాయించడం సరికాదని, ఈమేరకు జారీ చేసిన ఉత్తర్వులు ఉప సంహరించుకోవాలని ఎస్జీటీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్మల ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. తాజాగా కుల గణన విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని పేర్కొన్నారు.

చదవండి: Katroth Sumalatha: ఎంబీబీఎస్‌ సీటొచ్చినా కూలి పనులకు..

కుల గణన నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలకు మధ్యాహ్నం సెలవు ప్రకటిస్తే విద్యార్థులు చదువులో వెనుకబడతారని తెలిపారు. ఇప్పటికే ఎస్జీటీలకు టీచర్‌ ఎమ్మెల్సీలలో ఓటు హక్కు లేదని, అదనంగా సర్వే విధులు కేటాయించడం తగదని పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags