Telangana: స్టాఫ్‌నర్స్‌ ఇక నర్సింగ్‌ ఆఫీసర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్‌ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
స్టాఫ్‌నర్స్‌ ఇక నర్సింగ్‌ ఆఫీసర్‌

కేంద్ర ప్రభుత్వం మార్చినట్టుగా, తమ డిజిగ్నేషన్‌ను స్టాఫ్‌ నర్స్‌ నుంచి నర్సింగ్‌ ఆఫీసర్‌గా మార్చాలన్న డిమాండ్‌ను నెరవేర్చింది. వివిధ హోదాల్లో పేర్లు మార్పు చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ అక్టోబర్‌ 5న ఉత్తర్వులు జారీ చేసింది.

స్టాఫ్‌ నర్స్‌ హోదాను నర్సింగ్‌ ఆఫీసర్‌గా, హెడ్‌ నర్స్‌ హోదాను సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ (గ్రేడ్‌ 2) పేరును డిప్యూటీ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ (గ్రేడ్‌ వన్‌) పేరును చీఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వైద్య ఆరోగ్యశాఖతో పాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్‌ సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది.  

చదవండి: Andhra Pradesh Jobs: స్టాఫ్‌ నర్సుల భర్తీకి నోటిఫికేషన్‌

మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు 

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది గౌరవాన్ని పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ  ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు అందజేశారు.   

#Tags