TSRTC Driver and Conductor Jobs 2024 : ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు.. ఏ క్షణంలోనైన‌ నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే...!

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే నిరుద్యోగుల‌కు మ‌రో శుభ‌వార్త చెప్ప‌నున్న‌ది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో దాదాపు 3 వేలకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ప్రభుత్వం ఈ ఉద్యోగాల భ‌ర్తీకి సానుకులంగా ఉంది. ఏ క్షణంలోనైన డ్రైవర్‌, కండక్టర్ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. గత పదేళ్లుగా పోస్టుల భర్తీ లేకపోవడం, ఏటా పదవీ విరమణలతో ఖాళీలు పెరుగుతుండడంతో, మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి చేరింది. 

☛ T Harish Rao : డీఎస్సీ కంటే.. ముందే టెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల్సిందే.. లేకుంటే..

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్ల‌డుతూ..
సిబ్బంది అదనంగా మరికొన్ని గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మూడు వేల పోస్టుల భర్తీ దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని, ఉద్యోగులపై పని భారాన్ని తగ్గిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ పోస్టుల భర్తీతో సంస్థపై వేతనాల రూపంలో ప్రతి నెల రూ.8.40 కోట్లు, ఏడాదికి రూ.100.80 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ లెక్కకట్టింది.

2000 డ్రైవర్‌ పోస్టులను..

ఆర్టీసీ ప్రతిపాదనల్లో మూడింట 2 వేల వరకు డ్రైవర్‌ పోస్టులు ఉన్నాయి. సిబ్బంది సర్వీసులో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తోంది. ఈ విభాగంలో దాదాపు 800 మందిని కండక్టర్లుగా తీసుకునే ప్రక్రియ నడుస్తోంది. ఈ కారణంతో తాజా ప్రతిపాదనల్లో కండక్టర్‌ పోస్టుల భర్తీకి ప్రతిపాదించలేదని సమాచారం. ఆర్టీసీలో ప్రస్తుతం 42 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో డ్రైవర్లు 14,747 మంది కాగా, కండక్టర్లు 17,410 మంది. సంస్థలోని అద్దె బస్సుల్లో ఆర్టీసీ నుంచి కండక్టర్‌ మాత్రమే ఉంటారు. ఆ బస్సుల్ని అద్దెకిచ్చే యజమాని నుంచే ప్రైవేట్‌ డ్రైవర్‌ ఉంటారు.

☛ Good News for DSC Candidates 2008 : డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. వీళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఉద్యోగాలు.. ఇంకా..

#Tags