Lecturers in Telangana 2023 : లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. అర్హ‌తలు- కావాల్సిన సర్టిఫికెట్స్‌ ఇవే..

తెలంగాణ‌లో నాగర్ కర్నూల్ జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి గాను 67 గెస్ట్‌ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయనున్నామని ఇంటర్‌ విద్యనోడల్‌ అధికారి జి.వెంకటరమణ జూలై 19వ తేదీన (బుధవారం) ఒక ప్రకటనలో తెలియజేశారు.
Teaching Jobs 2023 News Telugu

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యా కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వివిధ సబ్జెక్టుల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు.

☛ Telangana : 1,654 గెస్ట్‌ లెక్చరర్ల ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.. నెల‌కు రూ.28,080 జీతం.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

అర్హ‌తలు- కావాల్సిన సర్టిఫికెట్స్‌  ఇవే..
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తుతో పాటు ఎస్‌ఎస్సీ మార్కుల మెమో, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మార్కుల సర్టిఫికెట్స్‌, క్యాస్ట్‌, లోకల్‌ సర్టిఫికెట్స్‌, గెజిటెడ్‌ అధికారిచే అటెస్టెడ్‌ చేయించి జూలై 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెలక్షన్‌ కమిటీ సభ్యుల ద్వారా ఎంపిక ఉంటుందని, కలెక్టర్‌ ఆమోదంతో జూలై 28వ తేదీన‌ తుది జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు.

☛ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌

పోస్టుల వివ‌రాలు ఇవే..
తిమ్మాజిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌, బోటనీ, కల్వకుర్తి జూనియర్‌ కళాశాలలో ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌, జూవాలజి, హిస్టరీ, సివిక్స్‌, కొల్లాపూర్‌ బాలుర జూనియర్‌ కశాలలలో ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌, బొటనీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌, కొల్లాపూర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో తెలుగు, కెమిస్ట్రీ, బోటనీ, ఎనామిక్స్‌, కోడేర్‌ జూనియర్‌ కళాశాలలో ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌, బోటనీ, ఎకనామిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, జువాలజీ, అచ్చంపేట బాలుర జూనియర్‌ కళాశాలలో మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, కామర్స్‌, ఎంఎల్‌టీ ఒకేషనల్‌, ఎంఎల్‌డీ ఒకేషనల్‌, అచ్చంపేట బాలికల జూనియర్‌ కళాశాలలో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) ఒకేషనల్‌, ఎస్‌వీ ప్రభుత్వ జూనియర్‌ పాలెం(2) కెమిస్ట్రీ, జువాలజి, నాగర్‌కర్నూల్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో తెలుగు, కెమిస్ట్రీ, బోటనీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, నాగర్‌కర్నూల్‌ బాలుర జూనియర్‌ కశాలలో మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, హిస్టరీ, సివిక్స్‌, ఫిజిక్స్‌, జువాలజీ, ఈటీ ఒకేషనల్‌, తాడూర్‌ జూనియర్‌ కశాలలో తెలుగు, కెమిస్ట్రీ, బోటనీ, కామర్స్‌, వెల్దండ జూనియర్‌ కశాలలో తెలుగు, బోటనీ, సివిక్స్‌, తాడూర్‌ జూనియర్‌ కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జూవాలజి, ఎకనామిక్స్‌, కొండనాగుల జూనియర్‌ కశాలలో హిస్టరీ, ఇంగ్లీష్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, వంగూర్‌ జూనియర్‌ కళాశాలలో తెలుగు, ఫిజిక్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేశారు.

☛ డిఫెన్స్‌ జాబ్స్

☛ AP Faculty Jobs 2023: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో కూడా..

మన్ననూర్‌ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల అప్‌ గ్రేడ్‌ జూనియర్‌ కళాశాలలో పార్ట్‌ టైమ్‌ లెక్చరర్లు, ఉపాధ్యాయులు, పీఈటీ, పీడీలుగా విధులు నిర్వహించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని ఆర్సీఓ నాగార్జునరావ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

☛ మెడికల్ జాబ్స్

ధ్రువపత్రాలు ఒక సెట్‌ జిరాక్స్‌తో నేరుగా ఆర్సీఓ ఆఫీస్‌ టీటీడబ్ల్యూఆర్‌ డిగ్రీ కళాశాల(మహిళలు) మహబూబ్‌నగర్‌ తిరుమల హిల్స్‌, అప్పన్నపల్లి కార్యాలయంలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు నిర్వహించే డెమోకు హాజరుకావాలన్నారు. మరింత సమాచారం కోసం 7901099784, మన్ననూర్‌ 9490957314 పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీ లకు సంబంధించిన వివరాలు ఈ ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి అడిగి తెలుసుకోవచ్చని సూచించారు.

☛ ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్

అకౌంటెంట్‌ ఉద్యోగానికి..

మన్ననూర్‌ అమ్రాబాద్‌ మండల కేంద్రం సమీపంలోని ఎల్మపల్లి గిరిజన మినీ గురుకులం (బాలికలు) పాఠశాలలో(అవుట్‌సోర్సింగ్‌) అకౌంటెంట్‌ ఉద్యోగానికి గానూ స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆర్సీఓ నాగార్జునరావ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

☛ రైల్వే జాబ్స్

దరఖాస్తుదారులు డిగ్రీతో పాటూ కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. బీకామ్‌ కంప్యూటర్‌ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. గురువారం నుంచి హెచ్‌ఎం, వార్డన్‌ మినీ గురుకులం ఎల్మపల్లి నుంచి దరఖాస్తు ఫారం పొందాలన్నారు. జూలై 27వ తేదీ వరకు దరఖాస్తు అదే పాఠశాలలో సమర్పించాలన్నారు. మరింత సమాచారానికి 9491030261, 94441302269 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

#Tags