Skip to main content

Telangana : 1,654 గెస్ట్‌ లెక్చరర్ల ఉద్యోగాల భ‌ర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.. నెల‌కు రూ.28,080 జీతం.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు మ‌రో శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లు పోస్టుల‌ నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
telangana 1654 guest lecturers jobs notification 2023 news in telugu
telangana guest lecturers jobs notification 2023

ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్ జూలై 18వ తేదీ (మంగళవారం) ఉత్తర్వులు జారీచేశారు. నియామక మార్గదర్శకాలను విడుదల చేశారు. 

నెల‌కు వేత‌నం :
ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్‌ నిమిత్తం రూ.390 చెల్లిస్తుంది. నెలకు 72 పీరియడ్లకు మాత్రమే అనుమతిస్తుంది. దీంతో వారికి రూ.28,080 చొప్పున వేతనం అందుతుంది.

☛ AP Faculty Jobs 2023: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా ఇంటర్‌ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీని ఏర్పాటుచేస్తారు. జిల్లాల్లో కాలేజీలవారీగా ఖాళీలను జూలై 19వ తేదీన‌(బుధ‌వారం) వెల్లడిస్తారు. జూలై 24వ తేదీలోగా అన్ని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జూలై 26వ తేదీన దరఖాస్తులను పరిశీలించి మెరిట్‌ అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. జిల్లా కలెక్టర్‌ 28న ఎంపికైన గెస్ట్‌ లెక్చరర్ల జాబితా వెల్లడిస్తారు.

చ‌ద‌వండి: TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్‌–2.. సక్సెస్‌ ప్లాన్‌

నియమించిన గెస్ట్‌ లెక్చరర్లల‌ను ఆగ‌స్లు 1వ తేదీన‌ సంబంధిత కాలేజీల ప్రిన్సి పాళ్లకు రిపోర్టు చేయాలి. గతంలో పనిచేసిన అతిథి అధ్యాపకులను తిరిగి కొన సాగించకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. అయితే కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త నియామక ప్రక్రియ అనివార్యమైందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 19 Jul 2023 01:37PM

Photo Stories