TS Government Job Calendar 2024 Release : తెలంగాణలో జాబ్ క్యాలెండర్-2024 విడుదల.. ఎప్పుడంటే..? పోస్టుల వివరాలు ఇవే..
ఈ మేరకు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏండ్లకేండ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది. సర్కారు ఆదేశాలతో 2024కు సంబంధించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు నెలల కిందే క్యాలెండర్ ప్రకటించాలని అనుకున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది.
ఈ ఏడాది నుంచి..
ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్‌ను సిద్ధం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోసం పంపించనున్నారు. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే.. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మూడేండ్లు పెంచడంతో గత మూడేండ్లుగా రిటైర్మెంట్స్ జరగలేదు. ఈ ఏడాది నుంచి ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. దీంతో ఇందులోనూ డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఖాళీల లెక్కలు తీస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్‌కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి, మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగానే గ్రూప్–1 లో పోస్టుల సంఖ్యను కూడా పెంచింది.
పోలీసు, టీచర్, గురుకుల, వివిధ పోస్టుల భర్తీతో పాటు..
పోలీసు, టీచర్, గురుకుల, వివిధ పోస్టుల భర్తీతోపాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్– 2, 3,4 కు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు రూపకల్పన చేస్తున్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్చేయాలనుకుంటున్నది.
ఇప్పటి వరకూ 30 వేలకు పైగా..
ఏటేటా రిటైర్మెంట్అవుతున్న కొద్దీ.. వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ, డైరెక్ట్ రిక్రూట్మెంట్పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ 30 వేలకు పైగా మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించింది.
☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..
14,099 కానిస్టేబుల్ పోస్టులను..
మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్‌బోర్డు పరిధిలో 6,956 స్టాఫ్‌నర్స్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్వరంలో 14,099 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు ఎంపికైన 7,800 మంది టీచర్లు, లెక్చరర్లకు నియామక పత్రాలను అందించింది. టీజీపీఎస్సీ అధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్మెంట్ ద్వారా 87 పోస్టులను భర్తీ చేసింది.
☛ Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్ పోస్టుల నోటిఫికేషన్ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్..
11,062 టీచర్ పోస్టుల భర్తీకి..
గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే..
జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు? ఏయే నెలల్లో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? అనే విషయాలను అందులో స్పష్టంగా తెలియజేస్తారు. ఇందులో ఇచ్చిన తేదీల మేరకు ఆయా గడువు తేదీల్లోగా రిక్రూట్మెంట్స్ పూర్తవుతాయి. దీనిపై ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్ తీసుకుంటోంది. సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడంతోపాటు ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుం టోంది. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీఎస్‌పీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్యారోగ్య నియామక బోర్డుల నుంచి ఇక ఏటా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
గ్రూప్-1, 2, 3, 4తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో..
ఏటా టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నారు. గ్రూప్-1, 2, 3, 4తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్స్ వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ