Telangana Medical Jobs : 1,800 నర్సింగ్ పోస్టుల భర్తీకి తొలి సంత‌కం.. అలాగే 7,356 ఉద్యోగాల‌కు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో నూత‌నంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి వెనువెంట‌నే ఆమోదం తెలుపుతుంది.

ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి 1,800 పోస్టులను మంజూరు చేస్తూ.. వాటి నియామకాన్ని చేపట్టాలనే ఫైల్ పై  వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తొలి సంతకం చేశారు.

 ఈ నేపథ్యంలో 1800 నర్సింగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 7 వేలకు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న సంగతి తెలిసిందే.

7,356 పోస్టుల‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా..
గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హాయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ నోటిఫికేషన్ల కింద మొత్తంగా 7,356 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్‌లు అన్ని వివిధ దశలలో ఉన్నాయి. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల‌ను రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టింది.ఇందులో భాగంగా 5,204 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది. వీటికి సుమారు 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా, రాత పరీక్ష నిర్వహించి ‘కీ’ని కూడా విడుదల చేశారు. రెండు నెలల క్రితమే అభ్యంతరాలు స్వీకరించారు. మెరిట్ జాబితా విడుదలచేసి, నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

☛ Anganwadi posts: భారీగా 3,989 అంగన్వాడీ పోస్టులు... నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

1,996 ANM పోస్టుల‌ నియామకానికి..
ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో 1,996 మంది ANM ల నియామకానికి ఆగస్టులో ప్రకటన వెలువడగా దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. దరఖాస్తులు భారీగా వచ్చాయి. నవంబరు 10వ తేదీన రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడింది. రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారమూ బోర్డు నుంచి వెలువడకపోవడంతో దరఖాస్తుదారులంతా ఆందోళన చెందుతున్నారు. ఆయుష్ విభాగంలో 156 మంది వైద్యుల నియామక ప్రక్రియకు ఆగస్టులో ప్రకటన వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. తదుపరి నియామక ప్రక్రియ నిల్చిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరగా ఆయా పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

#Tags