TS Teachers Promotions and Transfers Update News 2024 : టీచర్ల బదిలీలు, పదోన్నతులకు లైన్ క్లియర్.. జూన్ రెండో వారంలోనే..!
ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో దాదాపు 60000 వేల మంది టీచర్లు టాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. టెట్ అర్హతతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే. అలాగే తెలంగాణ టెట్ ఫలితాల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపిన విషయం తెల్సిందే.
☛ TS TET Results 2024 Release Date : టీఎస్ టెట్ -2024 ఫలితాలు విడుదల.. ఎప్పుడంటే..?
దాదాపు 11,062 ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి.. కానీ..
డీఎస్సీ ద్వారా అదనంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి వస్తున్నాయని, అన్నింటినీ కలిపి హేతుబద్ధీకరణ చేపడతామని తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తామని గతంలో బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు.
ప్రైవేటు స్కూల్స్‌లో ఇష్టారాజ్యంగా ఫీజు వసూలు..
కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారనే ఫిర్యాదులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టిసారించిందని తెలిపారు.
☛ Government Teachers TET Eligibility 2023 : ఈ టీచర్లకు చెక్.. మూడేళ్లలో 'టెట్' అర్హత సాధించాల్సిందే.. నిబంధనపై..
పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదును..
ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని, విద్యార్థుల్లో వ్యక్తిత్వ, మానసిక వికాసం, దేహదారుఢ్యం పెంపొందించేందుకు ప్రత్యేక సాంస్కృతిక, క్రీడాశిక్షణ తరగతులు నిర్వహిస్తామని, వారంలో నాలుగు రోజుల పాటు ఇవి ఉంటాయని, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా వీటిని చేపడతామని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదును పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ గుర్తింపు విధానంతో పనిచేసే యాప్‌ను ప్రవేశపెడతామని తెలిపారు.
Tags
- Telangana Teachers Promotions 2024
- Telangana Teachers Promotions 2024 News
- Telangana Teachers Promotions 2024 Update News in Telugu
- Telangana Teachers Promotions and Transfers 2024
- Telangana Teachers Promotions and Transfers 2024 News in Telugu
- Telangana Teachers Transfers 2024
- Telangana Teachers Transfers 2024 News in Telugu
- TS Teachers Transfers 2024 Update News
- Teachers Transfers 2024 News in Telugu
- TS Government Teachers Promotions and Transfers 2024
- TS government Teachers Promotions 2024 news telugu
- TS government Teachers Transfers 2024
- TS government Teachers Transfers 2024 news telugu
- ts government Teachers transfers 2024
- ts government Teachers transfers 2024 news telugu