TG Court Jobs Applications 2025 : 1673 కోర్టు ఉద్యోగాలు.. ఇలా ఫాలో అయి దరఖాస్తు చేసుకోండి...
ఇందులో 1277 టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి.. మరో 184 నాన్-టెక్నికల్ కోటాలో ఉన్నాయి. ఇక తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులను కూడా రిక్రూట్ చేయనున్నారు. వీటికి ఏప్రిల్, జూన్‌లో రాత పరీక్షలు జరుగుతాయి. అర్హులైన అభ్యర్థులు https://tshc.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు ఇలా ఫాలో అయి దరఖాస్తు చేసుకోండి వచ్చు...
అర్హులైన అభ్యర్థులు https://tshc.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పలు నోటిఫికేషన్ల నెంబర్లతో కనిపించే లింక్స్ కనిపిస్తాయి. మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయాలి. పార్ట్ ఏలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీఆర్ ఐడీ, పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత పార్ట్ బీలో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నిర్ణయించిన రుసుం చెల్లించాలి. వివరాల పూర్తి తర్వాత సబ్మిట్ బటన్ పై నొక్కాలి. మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.