Staff Nurse Jobs: 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. జోన్‌ల వారీగా ఖాళీలు ఇలా
కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల నుంచి ఆక్టోబర్ 5వ తేదీ సాయంత్రం ఐదు వరకూ http://cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. ఈ ఫారాలను వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సంబంధిత రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ/బీఎస్సీ నర్సింగ్ చదివి ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 42 ఏళ్లు పైబడని వారు దరఖాస్తుకు అర్హులు.
చదవండి: Staff Nurse Jobs : స్టాఫ్ నర్సు ఉద్యోగం పేరిట టోకరా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్ మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు చొప్పున సడలింపు ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు రూ.300 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాలి. వైద్య శాఖ అవసరాలకు అనుగుణంగా ఖాళీల సంఖ్య ఇంతకంటే పెరిగే/తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మెరిట్ లిస్ట్ ఏడాది పాటు అమల్లో ఉంటుందని తెలిపారు.
చదవండి: Skill Development and Training Department: జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు 150 మంది ఎంపిక
జోన్‌ల వారీగా ఖాళీలు
జోన్ 1 |
86 |
జోన్ 2 |
220 |
జోన్ 3 |
34 |
జోన్ 4 |
94 |
మొత్తం |
434 |