Big Good News For AP Anganwadi Workers Salary Hike and Demands : బ్రేకింగ్ న్యూస్‌.. అంగన్‌­వాడీలతో చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు అంగన్‌­వాడీలతో జ‌న‌వ‌రి 22వ తేదీన (సోమ‌వారం) జ‌రిపిన‌ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి. అంగన్‌­వాడీల డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం సానుకులంగా నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అంగన్‌­వాడీలు నేటి నుంచి విధుల‌కు హాజ‌రుకానున్నారు.

ఆంధ‌ప్ర‌దేశ్ ముఖ్య­మంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అంగన్‌­వాడీల సమస్యలపై సాను­భూతి­తో వ్యవహరిస్తోందనీ, ఆయన ఆదే­శాలతో ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిపామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వారికి వీలైనంతవరకూ మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు.  అంగన్‌వాడీ యూ­నియన్‌ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారా­యణ, సజ్జల రామకృష్ణారెడ్డి జ‌న‌వ‌రి 22వ తేదీ( సోమ‌వారం) రాత్రి చర్చలు జరిపారు.

అడిగినవన్నీ..

ఇప్పటికే రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కింద అంగన్‌వాడీ వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాం. దానిపై వారు మరోసారి ప్రతిపాదించడంతో వర్కర్లకు రూ.1.20లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.సర్వీసులో ఉండగా చనిపోతే గతంలో రూ.3వేలే ఇచ్చే వారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.25 వేలు ఇవ్వాలని కోరగా రూ.20 వేలు ఇస్తామన్నాం.ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు, పదోన్నతుల వయో పరిమితి 40 నుంచి 50 ఏళ్లకు అంగీకరించాం. టీఏ, డీఏలు, హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చేలా ఆమోదించాం. మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ అంగన్‌వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపాం. 
పెంపుపై..

చంద్రబాబు హయాంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన వేతనం ఎంత? వైఎస్‌ జగన్‌ ఇస్తున్న వేతనం ఎంత? అనేది అంగన్‌వాడీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2014లో అంగన్‌వాడీ వర్కర్లకు రూ.4,200, హెల్పర్ల­కు రూ.2,200, అదే 2016లో రూ.7 వేలు, రూ.4,500 ఇచ్చారు. అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల వేతనం పెంచుతామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇవ్వడంతో ఎన్నికల ఆర్నెల్ల ముందు చంద్రబాబు వేతనాలు పెంచినా... సక్రమంగా అందించలేదు. ఇచ్చిన మాట ప్రకారం జగన్‌ అధికారం చేపట్టిన వెంటనే జూలైలో వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలకు వేతనాలు పెంచారు. చంద్రబాబు హయాంలో వర్కర్లకు సగటున నెలకు రూ.6,100 మాత్రమే వస్తే... జగన్‌ పాలనలో నాలుగున్నరేళ్లుగా రూ.11,500 ఇస్తున్నారు.

#Tags