Skip to main content

Anganwadis protest demands: అంగన్‌వాడీల నిరసన డిమాండ్లు ఏమిటంటే..

Anganwadis protest demands news
Anganwadis protest demands news

ముంచంగిపుట్టు: అంగన్‌వాడీల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని సీఐటీయూ మండల కార్యదర్శి కె.శంకరరావు డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు నిరసన వ్యక్తం చేశారు.

భారీగా ఉపాధ్యాయ పోస్టులు: Click Here

ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలను విస్మరించారని ఆరోపించారు. హామీలను అమలు చేయని పక్షంలో సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం సర్పంచ్‌ కె.త్రినాథ్‌,అంగన్‌వాడీ కార్యకర్తలు సత్యవతి,మౌలమ్మ,ఈశ్వరి, సుజాత పాల్గొన్నారు.

Published date : 14 Aug 2024 09:31PM

Photo Stories