Government Employees Family Success Story : ఆ నలుగురూ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులే.. కానీ..!

తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌లే డీఎస్సీ-2024 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో ఎంతో మంది త‌మ స‌త్తాచాటి ఉద్యోగాల‌ను సాధించారు. అలాగే చాలా కుటుంబల‌లో అన్న‌-చెల్లి, తండ్రి-కొడుకు ఇలా ఉద్యోగాలు సాధించిన విష‌యం తెల్సిందే.

స‌రిగ్గా ఇలాగే... తెలంగాణ‌లోని రామన్నపేటకు చెందిన ఉపాధ్యాయుడు పోతరాజు వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు నలుగురు ప్ర‌భుత్వ ఉద్యోగులే.

➤☛ TG DSC Ranker Success Story 2024 : పేదరికంతో పోరాటం చేస్తూ... అనుకున్న ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగం సాధించానిలా.. కానీ..

భార్య భర్తలు ఇద్ద‌రు కూడా..
పట్టణానికి చెందిన పోతరాజు ఈశ్వరయ్య–లక్ష్మమ్మ కుమారుడైన వెంకటేశ్వర్లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో విద్యనభ్యసించాడు. చిన్నప్పుడు హోటల్‌ నిర్వహణలో తండ్రికి సహాయపడుతూ.. 1996లో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య శారద మహాత్మా జ్యోతీరావుపూలే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు.

➤☛ ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

☛➤ TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వ‌చ్చిన డ‌బ్బుతో నా కొడుకుని చ‌దివించానిలా... కానీ...

వీరి కూమారుడు.. కోడ‌లు కూడా..
వీరి కుమారుడు సుశాంత్‌ మద్రాస్‌ ఐఐటీలో ఎంటెక్‌పూర్తి చేసి ఇంటెల్‌కోర్‌లో జాబ్‌ చేస్తున్నారు. కోడలు పావని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీటెక్‌ పూర్తి చేసి ఇటీవలే ఆర్‌ అండ్‌ బీలో సహాయ ఇంజనీరు ఉద్యోగం సాధించింది. పాలిటెక్నిక్‌ లెక్చరర్‌గా కూడా ఎంపికైంది. 

ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉద్యోగాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

➤☛ TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చ‌దివి.. టీచ‌ర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !

#Tags