4,356 Jobs: వైద్య కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ!.. వివిధ కాలేజీల్లో పోస్టుల వివరాలు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టులను కాంట్రాక్టు, గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

3,155 పోస్టులను కాంట్రాక్టు, 1,201 పోస్టులను గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయనుంది. ఈ మేరకు మార్చి 12న‌ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్‌ పోస్టులు 498, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 786, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 1,459, ట్యూటర్‌ 412, సీనియర్‌ రెసిడెంట్స్‌ పోస్టులు 1,201 భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది (2025) మార్చి 31వ తేదీ వరకు అంటే ఏడాది కాలానికి వీరిని నియమిస్తారు.

చదవండి: Jobs in Telangana: ఈ ఉద్యోగాల‌కు పోటెత్తిన దరఖాస్తులు!.. ఖాళీలు, దరఖాస్తులు ఇలా..

మెడికల్‌ కాలేజీల్లో జాతీ య మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తనిఖీలు చేయనున్నందున పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయా లజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, ఆర్ధోపెడిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, అనెస్థీషియా, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. 

స్థానికులకు ప్రాధాన్యత

మార్చి 16వ తేదీన ఆయా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ప్రొఫెసర్‌ పోస్టుకు 8 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెల వేతనం రూ.1.90 లక్షలు కాగా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.లక్షన్నర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.92,575, ట్యూటర్‌కు రూ.55 వేలు ఇవ్వనున్నారు.

చదవండి: Permanent Employees: వైద్యారోగ్యశాఖలో పర్మెనెంట్‌ అయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. అయితే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. స్థానికులు లేనప్పుడు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయస్సు ఈ నెల 31వ తేదీ నాటికి 69 ఏళ్లకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సాహసోపేత నిర్ణయం: మంత్రి 

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకులు, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చదవండి: Singareni Jobs: సింగరేణి ఉద్యోగులకు గోల్డెన్‌ చాన్స్‌

పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏటా రూ.634 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

వివిధ మెడికల్‌ కాలేజీల్లో పోస్టుల వివరాలు

మెడికల్‌ కాలేజీ

పోస్టుల సంఖ్య

ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

274

గాంధీ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌

122

కాకతీయ మెడికల్‌ కాలేజీ, హనుమకొండ

197

రిమ్స్, ఆదిలాబాద్‌

153

నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

186

సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

200

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

139

సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

187

నల్లగొండ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

176

సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

164

మహబూబాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

208

మంచిర్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

197

జగిత్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

247

వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

246

నాగర్‌కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

236

భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

208

పెద్దపల్లి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, రామగుండం

257

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

115

కామారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

97

వికారాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

88

ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

101

కరీంనగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

99

జయశంకర్‌ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

124

జనగాం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

75

నిర్మల్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

117

కొమురంభీ ఆసిఫాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

143

#Tags