2000 Jobs: 2 వేలకుపైగా టీచర్ పోస్టుల ఖాళీలు
తక్కువ పోస్టుల భర్తీకి అనుమతివ్వడంతో అభ్యర్థులు నిరసన బాటపట్టారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 1,131 పోస్టుల భర్తీకి అనుమతించింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 273, పండిట్లు 102, పీఈటీలు 25, ఎస్జీటీలు 584, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 147 పోస్టులు ఉన్నాయి.
అయితే వాస్తవ ఖాళీలు 2 వేలకు పైగా ఉండటంతో చాలాచోట్ల ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు బోధన కష్టతరంగా మారింది. ఎక్కువగా నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల వంటి ప్రాంతాల్లో సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులు లేదు. ఈ ప్రభావం ఎస్సెస్సీ పరీక్షలపై పడే అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యా వలంటీర్లనైనా నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
చదవండి: DSC Exam Free Training : మూడు నెలల డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. ఈ పత్రాలు తప్పనిసరి!
ప్రభుత్వ ఆదేశాలు..
నారాయణపేట జిల్లాలో 545 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ప్రభావం విద్యా బోధనపై పడొద్దని ప్రభుత్వం 233 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అనుమతిచ్చింది. వాటికి అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తాం. మరిన్ని పోస్టుల్లో వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కలెక్టర్ అనుమతితో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
– అబ్దుల్‌ఘనీ, డీఈఓ, నారాయణపేట
కలెక్టర్ అనుమతితో..
జిల్లాలోని వివిధ పాఠ శాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నచోటి నుంచి అడ్జస్ట్‌మెంట్ లో భాగంగా బదిలీ చేసేందుకు ప్రక్రియ కొనసాగుతుంది. కలెక్టర్ అనుమతితో ఈ బదిలీ లు చేపడుతాం. జిల్లాలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– రవీందర్, డీఈఓ, మహబూబ్‌నగర్