Tomorrow All Schools Holiday Due to Heavy Rain 2024 : రేపు.. ఎల్లుండి స్కూల్స్ సెల‌వులు.. ఇంకా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : రానున్న నాలుగు రోజులు పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై సమీక్షించారు.

వర్షాలపై ప్రజల మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు పంపి అలర్ట్‌ చేయాలన్నారు. చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలని చెప్పారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేయాలని చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని చంద్రబాబు తెలిపారు. అవ‌సర‌మైతే స్కూల్స్‌, కాలేజీల‌కు కూడా సెల‌వు ఇవ్వ‌నున్నారు.

☛➤ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్, స్పెషల్ సీఎస్ సిసోడియా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, R&B శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. వ‌ర్షాల తీవ్ర‌త‌ను బ‌ట్టి వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్లు రేపు, ఎల్లుండి స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. 

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

☛➤ Four Sisters Doctor Success Story : నలుగురు కూతుళ్లేనా.. అని హేళన‌ చేశారు... కానీ ఇప్పుడు ఈ న‌లుగురు...

నెల్లూరు జిల్లాలోని ఇందుకూరిపేట, కోవూరు, కొడవలూరు మండలాల్లో ఎడతెరిపిలేకుండా భారీగా కురుస్తోంది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్‌ చేయాలని ప్రజలకు సూచించారు. డివిజన్‌, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని.. రెవెన్యూ, నీటిపారుదల అధికారులు పెన్నా నది గట్లు పరిశీలించాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ చెప్పారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది 

రేపు కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు..

ప్రకాశం జిల్లా ఒంగోలు, మద్దిపాడు, గిద్దలూరు, కొమరోలులో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ఒంగోలులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు, కొల్లూరు, వేమూరు, అద్దంకి, యద్దనపూడి, జె.పంగులూరు, బల్లికురవ, నిజాంపట్నం, కర్తపాలెంలో వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఉయ్యూరు, అవనిగడ్డలో ఈదరుగాలులతో వర్షం పడుతోంది. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అన్నమయ్య జిల్లాలోనూ వర్షం కురుస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ సెలవు ప్రకటించారు. అలాగే రేపు కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెల‌వు ఇచ్చే అవ‌కాశం ఉంది.

☛➤ Telangana Colleges Bandh : రాష్ట్ర‌వ్యాప్తంగా కాలేజీలు బంద్‌.. పిలువు.. ఎందుకంటే...?

రానున్న మూడు రోజులు తిరుమ‌ల‌లో కూడా..
రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. రాగల 36 గంటల్లో భారీ వర్ష సూచనపై సమావేశంలో ఉన్నతాధికారులు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో అక్టోబ‌ర్ 16వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబ‌ర్ 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని, అలాగే భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.

తెలంగాణ‌లో కూడా..

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. 

➤☛ TG DSC Candidates Success Stories : ఈ ఊరు నుంచి 5 మంది ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు కొట్టారిలా... కానీ వీరు మాత్రం.

రేపు.. ఎల్లుండి కూడా..
మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌తోపాటు నిర్మల్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు.  ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఓ చక్రవాతపు ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వ‌ర్ష తీవ్ర‌త బ‌ట్టి తెలంగాణ‌లో కూడా వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్లు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

☛➤ Two Sisters Success Storeis : మేము అక్కాచెల్లెళ్లు.. ఒకే సారి ఇద్ద‌రం ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టాం... ఎందుకంటే..?

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు

#Tags