FLN Program for School Education: పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సామ‌ర్ధ్యాన్ని పెంచే కార్య‌క్ర‌మం..

విద్యార్థుల‌కు ముందు నుంచే చ‌దువులో సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు చేప‌ట్టిన కార్య‌క్ర‌మ‌మే ఈ ఎఫ్‌ఎల్‌ఎన్‌. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థుల చ‌దువే కాకుండా వారు ఇత‌ర విష‌యాలు కూడా ప్రాథ‌మిక స్థాయిలో ఉంటాయ‌ని తెలిపుతూ కార్య‌క్ర‌మ వివ‌రాల్ని స్ప‌ష్టించారు..
District Education Officer Shyam Sundar speaking to teachers

సాక్షి ఎడ్యుకేష‌న్: జాతీయ విద్యావిధానంలో అమలు చేస్తున్న అంశాలను విద్యార్థులు అందుకునేందుకు విద్యాశాఖ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ప్రాథమిక స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలను మెరుగుపర్చే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో విద్యార్థి అభ్యసనా సామర్థ్యాల పెంపు ప్రత్యేక లక్ష్యంగా ఫౌండేషన్‌ లిటరసీ, న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(సాల్ట్‌)లో భాగంగా ప్రథమ్‌ అనే ప్రభుత్వేతర సంస్థ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి పూనుకుంది.

➤   Breakfast: మరో 15 పాఠశాలల్లో ‘అల్పాహారం’ షురూ

విద్యా సంస్కరణలు అందుకునేలా..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యావిధానం – 2020లో భాగంగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నిపుణ్‌ భారత్‌ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎర్లీ ఛైల్డ్‌ సెంటర్‌ ఎడ్యుకేషన్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2గా విభజించి అమలు చేయడానికి నిర్ణయించారు. ప్రీ ప్రైమరీ–1 లో 3, 4 ఏళ్ళ వయసు కలిగిన చిన్నారులకు, ప్రీ ప్రైమరీ–2లో 5, 6 ఏళ్ళ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యా బోధన చేస్తారు. ప్రీ ప్రైమరీలోనే పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాలు అమలు చేస్తారు. ఐదేళ్లు నిండిన చిన్నారులకు ప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీలో 1, 2 తరగతులకు ఫౌండేషన్‌ లిటరసీ, న్యూమరసీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి రెండో తరగతి నుంచి మూడో తరగతికి వెళ్ళే విద్యార్థులంతా ఆయా తరగతుల అభ్యసనా సామర్ధ్యాలు తప్పనిసరిగా పొందాలి.

➤   Job Mela: పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో జాబ్ మేళా..

జ్ఞాన జ్యోతి, జ్ఞాన ప్రకాష్‌గా..

ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను జ్ఞాన జ్యోతిగా, ప్రాథహిక విద్యను జ్ఞాన ప్రకాష్‌గా పిలుస్తున్నారు. తొలుత ప్రాథమిక విద్య బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు డీఆర్‌పీలకు శిక్షణ ఇచ్చారు. మండలానికి ముగ్గురు ఎస్‌జీటీ ఉపాధ్యాయులను డీఆర్‌పీలుగా ఎంపిక చేసి రెసిడెన్షియల్‌ విధానంలో శిక్షణ ఇచ్చారు. జ్ఞాన జ్యోతి డీఆర్‌పీలుగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు.

➤   Kho-Kho Selections: "ఖోఖో" క్రీడ‌లో బాలుర జ‌ట్ల ఎంపిక‌

10వ తరగతి నాటికి పూర్తి సామర్థ్యం

తెలుగు, గణితం, ఇంగ్లీషు వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులకు కనీస జ్ఞానం ఉండడం లేదని పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచే అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపరుచుకునేలా చర్యలు చేపట్టడానికే ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించడానికే లిటరసీ, న్యూమరసీ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యార్థి 3వ తరగతిలోకి వచ్చే సమయానికి తెలుగులో చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం నేర్చుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది.

–రూపావత్‌ రంగయ్య, ఏలూరు మండల విద్యాశాఖాధికారి–2

#Tags