Skip to main content

Job Mela: పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో జాబ్ మేళా..

నిరుద్యోగులు, అర్హ‌త ఆసక్తి గ‌ల వారు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ మెర‌కు ఆమె మాట్లాడుతూ.. ఈ ఉద్యోగానికి, ఇంట‌ర్య్వూకు సంబంధించిన స‌మాచారాన్ని వెల్ల‌డించారు.. జాబ్ మేళా వివ‌రాలు..
Unemployment Assistance,Job Interview Details,Employment Opportunity,Polytechnic Job FairPrincipal of Polytechnic college Sujata announces job mela,Polytechnic College Opportunity,
Principal of Polytechnic college Sujata announces job mela

సాక్షి ఎడ్యుకేష‌న్: స్థానిక ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 30న మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుజాత తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సిడాప్‌ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయన్నారు. ఈకామ్‌ డెలివరీ, నవతా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.

➤   job mela: రేపు జాబ్‌మేళా

పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మినీ జాబ్‌మేళా జరుగుతుందన్నారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఆపై విద్యార్హత ఉన్న 18 నుంచి 24 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పాన్‌, ఆధార్‌కార్డులతో పాటు అన్ని ధ్రువపత్రాల జెరాక్స్‌ కాపీలతో హాజరుకావాని కోరారు. ఇంటర్వ్యూలో ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.10వేల నుంచి రూ.12వేల వేతనం చెల్లిస్తారన్నారు. పూర్తి వివరాలకు www. apssdc. ian వెబ్‌సైట్‌తోపాటు,6304634447 నంబరులో సంప్రదించాలని ఆమె కోరారు.

Published date : 27 Oct 2023 01:43PM

Photo Stories