Breakfast: మరో 15 పాఠశాలల్లో ‘అల్పాహారం’ షురూ
హనుమకొండలోని లష్కర్‌బజార్ గర్‌ల్స్ ప్రాథమిక పాఠశాలలో ఎంపీపీఎస్ వంగపహాడ్ పాఠశాలలోనూ డీఈఓ కార్యాలయం కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బి.రాధ పర్యవేక్షించారు. విద్యార్థులకు ఆమె ఉప్మా వడ్డించారు. నడికుడ మండలంలోని పులిగిల్ల యూపీఎస్‌లో కూడా అల్పాహారంగా ఇడ్లి అందించారు. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్నభోజన కార్మికులే ఈ అల్పాహారం వంటచేసి పెడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు పాఠశాలల్లో అమలుచేస్తున్నారు.
చదవండి: Telangana: సర్కార్‌బడుల్లో ‘అల్పాహారం’.. టిఫిన్లు ఇవే..
దీంతో మొత్తంగా 17 పాఠశాలల్లోని అల్పాహారం పధకం అమలైనట్లయింది. మరో వారం రోజుల్లో మరికొన్ని పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు ఎంఈఓలు, హెచ్‌ఎంలు.. మధ్యాహ్న భోజన కార్మికులను ఒప్పించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వంనుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడం, మరోవైపు తమకు బిల్లులు సకాలంలో రావటం లేదని మధ్యాహ్నభోజన కార్మికులు ముందుకు రావటం లేదు. కానీ వారిపై ఒత్తిడి తీసుకొచ్చే యత్నం చేస్తున్నట్లు సమాచారం.