Telangana: సర్కార్‌బడుల్లో ‘అల్పాహారం’.. టిఫిన్లు ఇవే..
పిల్లల్లో పోషకాహార లోపం, తరగతిగదిలో ఆకలిని నివారించడంతోపాటు హాజరుశాతాన్ని పెంచడం లక్ష్యంగా అల్పాహార పథకం అమలుకానుంది. సోమవారం నుంచి శనివారం వరకు వేడివేడి టిఫిన్‌ను పాఠశాల సమయానికి ముందే విద్యార్థులకు అందించనున్నారు.
వేల్పూర్ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ అమీర్, ధర్పల్లిలో బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్‌లో గుణేశ్‌గుప్తా, నగర మేయర్ నీతూకిరణ్ అల్పాహారం పథకాన్ని ప్రారంభించనున్నారు. హెచ్‌ఎంలు, ఎంఈవోలు అల్పాహారం పథకాన్ని పర్యవేక్షించనున్నారు.
చదవండి: Schools and Colleges: పాఠశాలలు ఆధునిక దేవాలయాలు
టిఫిన్లు ఇవే..
ప్రతి సోమవారం సాంబారు ఇడ్లీ లేదా చట్నీతో గో ధుమరవ్వ ఉప్మా, మంగళవారం ఆలుకూర్మ పూరీ లేదా సాంబార్ టమాటబాత్, బుధవారం సాంబా ర్ ఉప్మా లేదా చట్నీతో బియ్యంరవ్వ కిచిడీ, అక్టోబర్ 5న సాంబార్ మిల్లేట్ ఇడ్లీ లేదా సాంబార్ పొంగల్, అక్టోబర్ 6న చట్నీతో ఉగ్గాని/మిల్లేట్ ఇడ్లీ లేదా చట్నీతో బియ్యంరవ్వ కిచిడీ, శనివారం సాంబార్ పొంగల్ లేదా ఆలుకూర్మ/పెరుగుచట్నీతో కూరగాయల పూలావ్‌ను విద్యార్థులకు అందించనున్నారు.