SCERT Question Papers : ప్రభుత్వ స్కూళ్లలో ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలు.. నేటి నుంచి ఫార్మెటివ్‌ పరీక్షలు

ప్రైవేటు స్కూళ్లలో మాత్రం సొంత ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించుకునేందుకు అంగీకరించింది. దీంతో పాఠశాల స్థాయిలో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది.

విశాఖ విద్య: కూటమి ప్రభుత్వం సమాంతర చదువులకు చరమగీతం పాడుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం సొంత ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించుకునేందుకు అంగీకరించింది. దీంతో పాఠశాల స్థాయిలో పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. జిల్లాలో ఫార్మెటివ్‌–2(శామ్‌) పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతుండగా.. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 3.44 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షలు కావడంతో వీటి నిర్వహణపై జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు.

Amazon Ends Work From Home: వర్క్‌ ఫ్రమ్‌ హోంకి అమెజాన్‌ స్వస్తి... పూర్తిగా ఆఫీస్‌ నుంచే పని చేయాలని ఆదేశాలు

ప్రైవేటు స్కూళ్లలో సొంత ప్రశ్నాపత్రాలు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో సమాంతర చదువులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్య, శిక్షణ పరిశోధన సంస్థ(ఎస్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రశ్నాపత్రాలతోనే ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని అన్ని స్కూళ్లలో ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలతో ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సొంతంగా ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసుకొని పరీక్ష నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించే ప్రైవేటు స్కూళ్లకు జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు ద్వారా ప్రశ్నాపత్రాలను సరఫరా చేయనుంది.

మార్కుల మాయాజాలానికి ఊతం

ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షల్లో సాధించిన మార్కులను విద్యార్థుల సామర్థ్యానికి కొలమానంగా చూస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అలాంటప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో వేర్వేరు ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించడం వల్ల వాస్తవితకత ఎలా తెలుస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలతో భవిష్యత్‌లో ప్రైవేటు స్కూళ్లకు క్రేజ్‌ పెరిగి, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు.

జిల్లాలో మొత్తం స్కూళ్లు 1,387

పరీక్షలు రాయనున్న విద్యార్థులు 3.44 లక్షలు

ప్రభుత్వ స్కూళ్లు 546

ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రంతో రాసే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు 83,336

ప్రైవేటు స్కూళ్లు 841

JEE Main 2025 Day Schedule: ఈ దినచర్య ఫాలో అయితే... టాప్ రాంక్ మీకు సొంతం!

ఇందులో చదువుతున్న విద్యార్థులు 2,60,664

ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రానికి

అంగీకరించిన ప్రైవేటు స్కూళ్లు 62

ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రంతో

పరీక్ష రాసేవారు 4,240

ఏర్పాట్లు పూర్తి చేశాం

ఫార్మెటివ్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. బుధవారం నుంచి ఈ నెల 8 వరకు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరిపడా ప్రశ్నాపత్రాలను డీసీఈబీ ద్వారా ముద్రించి స్కూల్‌ కాంప్లెక్స్‌లకు అందజేశాం. ఏ రోజుకారోజు అక్కడ నుంచి పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకెళ్లాలి. జిల్లాలోని 62 ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఎస్‌సీఈఆర్టీ ప్రశ్నాపత్రాలు కావాలని అడిగారు. వారికి అందజేస్తాం. పరీక్షల అనంతరం మూల్యాంకనం పూర్తి చేసి, మార్కులను ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశించాం.

– కృష్ణకుమార్‌, డీసీఈబీ సెక్రటరీ

10th Class: ‘పది’ ప్రత్యేక తరగతులు ప్రారంభం.. చదువులో వెనకబడిన వారికి ఇలా..

#Tags