Free Education at Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల స్వీకరణ

ఈ తరగతుల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..

కొరుక్కుపేట: విద్యా హక్కు (ఆర్‌టీఈ) చట్టం కింద తమిళనాడు రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో (మైనారిటీ స్కూల్స్‌ మినహా) 2024–25 విద్యా సంవత్సరానికి ఎల్‌కేజీ, 1వ తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Doordarshan Logo: ‘దూరదర్శన్‌ న్యూస్‌ ఛానల్‌’ చిహ్నం రంగు మార్పు

ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. మే 20లోగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రైవేట్‌ పాఠశాలల డైరెక్టర్‌ తెలిపారు. ఇతర వివరాలకు www.rte.tnshools.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మే 26న లాటరీ ద్వారా సీట్లు కేటాయిస్తామన్నారు.

Tenth Results 2024: పది ఫలితాల్లో బాలికలదే హవా

#Tags