Doordarshan Logo: ‘దూరదర్శన్ న్యూస్ ఛానల్’ చిహ్నం రంగు మార్పు
Sakshi Education
ప్రపంచ వార్తలను ప్రసారం చేసే జాతీయ దూరదర్శన్ న్యూస్ ఛానల్ చిహ్నం (లోగో) రంగును తాజాగా కాషాయ రంగులోకి మార్చారు.
గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా ఇటీవల కాషాయ రంగులోకి మారింది. ఈ మార్పు భాజపా జెండా రంగుతో సరిపోలి ఉండటం వల్ల రాజకీయంగా ప్రేరేపించబడిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రసార భారతి ప్రస్తుత సీఈవో గౌరవ్ ద్వివేది లోగో మార్పును సమర్థించుకున్నారు. దృశ్య సౌందర్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే రంగును మార్చినట్లు తెలిపారు.
Published date : 23 Apr 2024 04:16PM