Skip to main content

Sela Tunnel: ప్రపంచంలోనే అతి పొడవైన సెలా టన్నెల్‌ ప్రారంభం.. ఈ టన్నెల్‌ విశేషాలు ఇవే..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.
PM Narendra Modi Inaugurates Sela Tunnel at Arunachal Pradesh

ఈ టన్నెల్‌ విశేషాలు ఇవే..

  • సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్‌-తవాంగ్‌(BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. 
  • సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్‌-1 సింగిల్‌ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవుండగా.. టన్నెల్‌-2 రెండు సొరంగమార్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్‌-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు.
  • పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ఈ టన్నెల్‌ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. 

Geographical Indication Tag: కటక్ సిల్వర్ ఫిలిగ్రీకి భౌగోళిక సూచిక గుర్తింపు

  • దీంతో తవాంగ్‌-దిరాంగ్‌ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 
  • ఈ టన్నెల్‌ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్‌ వ్యవస్థలు, లైటింగ్‌, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు. 
  • 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది.
  • అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరితంగా సరిహద్దులకు చేరుకునే అవకాశం కలిగింది.
  • చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో డ్రాగన్‌ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది.

Underwater Metro: అండర్‌వాటర్‌ మెట్రో లైన్ ప్రారంభం.. ఎక్క‌డంటే..

Published date : 09 Mar 2024 04:11PM

Photo Stories