Bomb Threat To Private School: స్కూల్‌కు బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌ ద్వారా సమాచారం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సౌత్‌ ఢిల్లీలోని ఓ పాఠశాలకు బెదిరింపులు అందడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్‌ కైలాష్‌లోని ప్రైవేటు పాఠశాలకు ఈమెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబు అమర్చినట్లు గురువారం  అర్థరాత్రి ఈ మెయిల్‌ రాగా.. పాఠశాల అధికారులు 10 నిమిషాల్లోనే విద్యార్థులను ఖాళీ చేయించారు.

Layoffs In IT Sector: ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం..భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ

బాంబు డిటెక్షన్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాల మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయగా.. ఎలాంటి అనుమానాస్పదంగా ఏమీ కనుగొనలేదని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఈ బెదిరింపు బూటకమని అధికారులు ధృవీకరించారు. కాగా ఇటీవలే రాజధాని నగరంలోని పలు పాఠశాలలకు (వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

#Tags