Digital Education: పాఠశాలల్లో డిజిటల్‌ విద్య..!

పాఠశాల విద్యలో వినూత్న కార్యక్రమాలను అమలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను అందజేసింది. ఇప్పుడు వారికి పాఠాలు వినడం అర్థం చేసుకోవడం సులువైంది..

రామభద్రపురం: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యలో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోంది. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు డిజిటల్‌ విద్యను ప్రవేశపెట్టి విప్లవాత్మక చర్యలకు తెరతీసింది. బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్స్‌ను 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందజేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌(ఐఎఫ్‌పీ)ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని వినియోగించే విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చింది. డిజిటల్‌ విద్యను మరింత అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా ‘స్విఫ్ట్‌ చాట్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది.

Private Universities To Set Up Off-Campus Centres- ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఆఫ్‌ క్యాంపస్‌ల ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ

ఉపాధ్యాయుల బోధన మరింత మెరుగుపర్చేందుకు ఈ యాప్‌ను ప్రతి ఉపాధ్యాయుడు ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసేలా రూపొందించిన యాప్‌ను ప్రతి ఉపాధ్యాయుడు డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ఉన్నత విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన లింక్‌ను కూడా విద్యాశాఖ ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, హెచ్‌ఎంల ద్వారా టీచర్లకు చేరవేసింది. లింక్‌తో పాటు ఇన్‌స్టాలేషన్‌ ఏ విధంగా చేసుకోవాలో తెలియజేసే సమాచారాన్ని పంపించారు. ఇప్పటికే 99 శాతం మంది ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.

SSC Latest Notification: 2049 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

గణితం, సైన్స్‌ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌..

ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీపై ఇప్పటికే గణితం, ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు ఒక రోజు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహించారు.ఈ తరగతుల్లో స్విఫ్ట్‌ యాప్‌, ఓ ల్యాబ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెంట్‌ అసిస్టెంట్‌ ఫర్‌ టీచర్స్‌, చాట్‌ జీపీటీ వంటి యాప్స్‌, పలు వెబ్‌సైట్లపై అవగాహన కల్పించారు.

స్విఫ్ట్‌ చాట్‌ అంటే..

ఉపాధ్యాయులు బోధన చేసే సమయంలో విద్యార్థుకు సబ్జెక్టు పరంగా సమగ్రమైన జ్ఞానాన్ని అందించాల్సి ఉంటుంది. బోధనలో భాగంగా తెలియని అంశాన్ని వాట్సాప్‌ చాట్‌ మాదిరిగానే స్విఫ్ట్‌ చాట్‌లో ఎస్‌ఎంఎస్‌ చేస్తే క్షణాల్లో సంబంధిత సమాచారం యాప్‌లో ప్రత్యక్షమవుతుంది. ఈ యాప్‌లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తరగతుల వారీగా డిజిటల్‌ తరగతులు, లైవ్‌ క్విజ్‌లు, కాంపిటేషన్‌ జోన్‌, స్కిల్‌ కార్నర్‌లు, రికార్డులు పొందుపర్చారు. నచ్చిన అంశాన్ని సేవ్‌ ఐటమ్స్‌లో స్టోర్‌ చేసుకునే అవకాశం యాప్‌లో ఉంది. ప్రస్తుతం ఒకటి, రెండు తరగతులకు గణితం, మూడు నుంచి ఆరవ తరగతి వరకు గణితం, సైన్స్‌ సబ్జెక్టులపై మాత్రమే డిజిటల్‌ తరగతులు, క్విజ్‌లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సబ్జెక్టులపై కూడా భవిష్యత్‌లో డిజిటల్‌ తరగతులు పొందుపర్చనున్నారు.

Admissions at KGBV: కేజీబీవీ పాఠశాలలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానం

ఐఎఫ్‌పీ, బైజూస్‌ ట్యాబ్స్‌తో యాప్‌ అనుసంధానం

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి

స్విఫ్ట్‌ చాట్‌ యాప్‌ను ఉపాధ్యాయుల ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని, రిజిస్ట్రేషన్‌ చేసుకొనే ప్రక్రియ పూర్తికావచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు కూడా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సాంఘిక సంక్షేమం, గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు త్వరలో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశమిస్తాం.

– ప్రేమ్‌కుమార్‌, డీఈవో, విజయనగరం

#Tags