Vacancies in Railway Recruitment Board: రైల్వేలో కొలువుల జాత‌ర‌, 9144 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు 9144 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 9144
ఖాళీల వివరాలు

1. టెక్నీషియన్‌(గ్రేడ్‌-1): 1092 పోస్టులు
అర్హత: బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణలై ఉండాలి.

2. టెక్నీషియన్‌(గ్రేడ్‌-3): 8051 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. 


వయస్సు: జులై 1, 2024 నాటికి  18-36 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.500/( ఎస్సీ/ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ మైనారిటీ/ ఈబీసీ అభ్యర్థులు రూ. 250/ చెల్లించాలి. 
ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200.. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 08, 2024

#Tags