RRB Job Notification 2024: రైల్వేలో 9,144 టెక్నీషియన్ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- 9,144 పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్
- ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ
రెల్వే శాఖ భారీ సంఖ్యలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు వేర్వేరు అర్హతలు పేర్కొన్నారు. సంబంధిత అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ రాత పరీక్షలో ప్రతిభ చూపితే రైల్వేలో కొలువుదీరొచ్చు.
అర్హతలు
- టెక్నీషియన్ గ్రేడ్ 1సిగ్నల్ పోస్టులకు బీఎస్సీ, బీఈ/బీటెక్, డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్‌సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
- టెక్నీషియన్ గ్రేడ్3 పోస్టులకు మెట్రిక్యులేషన్, ఎస్‌ఎస్‌ఎల్‌సీ,ఐటీఐ లేదా 10+2 ఉత్తీర్ణత ఉండాలి.
వయసు
01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18–36 ఏళ్ల మధ్య ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18–33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ప్రారంభ వేతనం
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు నెలకు రూ.29.200, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు నెలకు రూ.19,900 ప్రారంభ వేతనం లభిస్తుంది.
చదవండి: RRB Notification 2024: 9000 టెక్నీషియన్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఎంపిక ప్రక్రియ ఇలా
- టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
- టెక్నిషియన్ గ్రేడ్–1(సిగ్నల్).. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) వంద మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 10 ప్రశ్నలు–10 మా ర్కులు,జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 ప్రశ్నలు–15 మార్కులు,బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 ప్రశ్నలు–20 మార్కులు, మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు–20 మార్కులు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
- టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు.. నిర్వహించే రాత పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ సైన్స్ 40 ప్రశ్నలు–40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 10 ప్రశ్నలు–10 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
పదోన్నతులతో ఏఈ స్థాయికి
టెక్నిషియన్ గ్రేడ్–1 (సిగ్నల్), టెక్నిషియన్ గ్రేడ్–3 పోస్ట్‌లలో నియమితులైన వారు భవిష్యత్తులో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ హోదాకు చేరుకునే అవకాశం ఉంది. తొలుత సీనియర్ టెక్నిషియన్‌గా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ వరకు చేరుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌ఆర్‌బీలు అంతర్గతంగా నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సీనియారిటీ ప్రాతిపదికగా ఏఈఈ వరకు చేరుకోవచ్చు.
చదవండి: RPF Recruitment 2024: రైల్వే శాఖలో 4660 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
రాత పరీక్షల్లో రాణించేలా
మ్యాథమెటిక్స్
నంబర్ సిస్టమ్, బాడ్‌మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్; రేషియో అండ్ ప్రపోర్షన్; పర్సంటేజెస్, మెన్సురేషన్; టైం అండ్ వర్క్; టైం అండ్ డిస్టెన్స్; ఇంట్రస్ట్; ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, కేలండర్ అండ్ క్లాక్‌పై పట్టు సాధించాలి. వీటికోసం తొలుత పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల్లో ఉన్న సిలబస్‌లోని అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి.అదే విధంగా బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్
అనాలజీస్, ఆల్ఫాబెటికల్, నంబర్ సిరీస్, కోడింగ్–డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, జంబ్లింగ్, వెన్‌డయాగ్రమ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, సఫీషియెన్సీ; కన్‌క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్; సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్; అనలిటికల్ రీజనింగ్; క్లాసిఫికేషన్; డైరెక్షన్స్ తదితర అంశాలపై దృష్టి సారించాలి.
జనరల్ అవేర్‌నెస్
- జాతీయ,అంతర్జాతీయ ప్రాధాన్యమున్న కరెంట్ అఫైర్స్, క్రీడలు, భారత చరిత్ర, సంస్కృతి, ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు, జనరల్ సైన్స్–లైఫ్ సైన్స్ (పదో తరగతి స్థాయి), స్వాత్రంత్య ఉద్యమం, జాగ్రఫీ, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్షం, భారత అణు కార్యక్రమం, ఐక్యరాజ్యసమితి, ఇతర ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు, పర్యావరణ అంశాలు, కంప్యూటర్ ప్రాథమిక అంశాలు, దేశంలో రవాణా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
- మెంటల్ ఎబిలిటీ: ఇందులో అనాలజీస్, నంబర్ సిరీస్, కోడింగ్, డీ కోడింగ్, రిలేషన్‌షిప్స్, సిలాజిజమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్స్–ఆర్గ్యుమెంట్స్‌పై దృష్టి సారించాలి.
జనరల్ సైన్స్
యూనిట్స్, ఫోర్స్, ప్రెజర్; మెకానిక్స్, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, మోడర్న్ ఫిజిక్స్ తదితర అంశాల్లోని బేసిక్ కాన్సెప్టులు, సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. కెమిస్ట్రీలో ఆటమ్స్, మాలిక్యూల్స్, యాసిడ్స్, బేసెస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్; కార్బన్ కాంపౌండ్స్, మెటలర్జీ తదితర అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా లైఫ్ సైన్సెస్‌కు సంబంధించి హ్యూమన్ బాడీ, విటమిన్లు, న్యూట్రిషన్, నెర్వస్ సిస్టమ్, హార్మోన్లు, ఎంజైమ్‌లు, సూక్ష్మజీవులు, వ్యాధులు, టీకాలు, పర్యావరణం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ డ్రాయింగ్ (ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్‌స్టుమ్రెంట్స్, లైన్స్, జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రెజెంటేషన్స్), యూనిట్స్, మెజర్‌మెంట్స్; మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ; వర్క్ పవర్ అండ్ ఎనర్జీ; స్పీడ్ అండ్ వెలాసిటీ; హీట్ అండ్ టెంపరేచర్; బేసిక్ ఎలక్ట్రిసిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 8
- సీబీటీ–1: అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం
- సీబీటీ–2: డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rrbsecunderabad.gov.in/
చదవండి: RRB Technician Exam Pattern: రైల్వేలో 9144 టెక్నీషియన్ ఉద్యోగాలు.. సిలబస్, పరీక్ష సరళి ఇదే..
Tags
- RRB Recruitment 2024
- rrb recruitment 2024 apply online
- RRB Job Notification 2024
- Indian Railway Jobs
- railway jobs
- Technician jobs
- RRB Technician Recruitment 2024
- Engineering Jobs
- Preparation Guidance
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- IndianRailways
- RailwayZones
- TechnicalDepartments
- GaugesReplacement
- notifications
- TechnicianPosts
- RRB
- SelectionProcedure
- exampreparation
- Success
- Recruitment
- JobVacancies
- CareerOpportunities