Skip to main content

RRB Technician Exam Pattern: రైల్వేలో 9144 టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. సిలబస్‌, పరీక్ష సరళి ఇదే..

Selection Process   RRB Technician Exam Pattern   Railway Recruitment Board Notification

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు 9144 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  ఈ క్రమంలో exam pattern ఎలా ఉంటుంది? పరీక్ష సమయం ఎంత ఉంటుంది? సెలక్షన్‌ ప్రాసెస్‌ ఎలా చేస్తారు వంటి పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. 

టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 పోస్టుల కోసం సిలబస్‌

1. జనరల్‌ అవేర్‌నెస్‌
2. జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
3. కంప్యూటర్‌ బేసిక్స్‌
4. మ్యాథ్స్‌
5. బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌
విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. సమయం 1:30 నిమిషాలు. 

టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 పోస్టుల కోసం సిలబస్‌
1. మ్యాథమేటిక్స్‌
2. జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
3. జనరల్‌ సైన్స్‌
4. జనరల్‌ అవేర్‌నెస్‌
విభాగాల నుంచి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. సమయం 1:30 నిమిషాలు. 

ఎంపిక విధానం
కంప్యూటర్‌ బేస్‌డ్‌ టెస్ట్‌(CBT)ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఈ టిప్స్‌ ఫాలో అయితే ఉద్యోగం మీదే

  •  exam pattern అండ్‌ సిలబస్‌ ఏంటన్నదానిపై ముందు ఓ అవగాహన ఏర్పరుచుకోవాలి. దానికి తగ్గట్లు ప్రిపరేష్‌ మొదలుపెట్టాలి. 
  • ప్రీవియస్‌ క్వశ్చన్‌ పేపర్లను బాగా ప్రాక్టీస్‌ చేయండి. 
  • ఏ పరీక్షకు అయినా టైం మేనేజ్‌మెంట్‌ అన్నది చాలా ముఖ్యం. ఎక్కువగా బిట్స్‌ ప్రాక్టీస్‌ చేస్తే ఏ ప్రశ్నకు ఎంత సమయం వెచ్చించాలన్న అవగాహన వస్తుంది. 
Published date : 12 Mar 2024 02:49PM

Photo Stories