Skip to main content

RPF Recruitment 2024: రైల్వే శాఖలో 4660 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ).. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌)–రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Recruitment Notice for RPF and RPSF Posts   Opportunity to Serve in Railway Security  RPF Recruitment 2024  RRB RPF SI Recruitment   RRB RPF Constable Recruitment    Apply for 4660 constable and sub inspector jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 4660
పోస్టుల వివరాలు: సబ్‌–ఇన్‌స్పెక్టర్‌–452, కానిస్టేబుల్‌–4208.
అర్హత
సబ్‌–ఇన్‌స్పెక్టర్‌: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 
వయసు: 01.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం: రూ. 35,400.
కానిస్టేబుల్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం: రూ. 21,700.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష.

ఎంపిక విధానం: రాతపరీక్ష,  ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.04.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.05.2024

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rpf.indianrailways.gov.in/RPF/

చదవండి: RRB Notification 2024: 9000 టెక్నీషియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 16 Mar 2024 10:44AM

Photo Stories