Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

పార్వతీపురం టౌన్‌: పాలకొండలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ చదువుకొని 18 – 25 ఏళ్ల యువతి, యువకుల కోసం మినీ జాబ్‌ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మినీ జాబ్‌ మేళాలో కంపెనీ ప్రతినిధులు పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులను వారి కంపెనీ కోసం ఎంపిక చేసుకుంటారని తెలిపారు.

Jobs In Union Bank of India 2024: డిగ్రీ అర్హతతో.. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు, జీతం నెలకు రూ. 77వేలు

ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరాలను హెచ్‌టీటీపీఎస్‌://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్‌ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్‌ నెంబర్‌తో పాటుగా రెజ్యూమ్‌, ఆధార్‌ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్‌, జెరాక్స్‌, 1 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోతో ఉదయం 9 గంటలకు డ్రైవ్‌ జరిగే ప్రదేశానికి హాజరు కావాలని కోరారు. వివరాలకు 63012 75511 నంబరును సంప్రదించాలని సూచించారు.


జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

ఎప్పుడు: అక్టోబర్‌ 29
ఎక్కడ: పాలకొండ, పార్వతీపురం

విద్యార్హత: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ/డిగ్రీ
వయస్సు: 18-25 ఏళ్లకు మించకూడదు

వివరాలకు: 63012 75511 నెంబర్‌ను సంప్రదించండి. 

Palamuru university: ఇంజనీరింగ్‌, లా కాలేజీకి గ్రీన్‌సిగ్నల్‌.. వందకు పైగా పోస్టుల భర్తీ

#Tags