AP POLYCET 2024: పాలిసెట్‌-2024 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?

విద్యార్థులకు నిర్వహించనున్న పాలిసెట్‌-2024 పరీక్షకు సంబంధించి దరఖాస్తు వివరాలను, పరీక్ష తేదీని కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. పరీక్ష కోసం చల్లించాల్సిన ఫీజు, దరఖాస్తులు తదితర వివరాలను వివరించారు..

పాడేరు: ఈ ఏడాది ఏప్రిల్‌ 27న నిర్వహించనున్న పాలిసెట్‌–2024కు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుజాత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఏప్రిల్‌ 5వ తేదీలోగా టెన్త్‌ పాసైన, ప్రస్తుతం పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు పాడేరు జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

UPSC మరియు APPSC విద్యార్థులందరి కోసం EKAM IAS అకాడమీ కొత్తగా APPSC GROUP-1 & GROUP-2 మెయిన్స్ టెస్ట్‌ సిరీస్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభిస్తోంది

టెన్త్‌ సిలబస్‌ ఆధారంగానే ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి విద్యార్థులకు పాలిసెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణ ప్రారంభిస్తామని, మెటీరియల్‌ కూడా అందజేస్తామన్నారు. పాడేరు జీఎంఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌–60, మెకానికల్‌–60, ఎలకి్‌ట్రకల్‌ ట్రేడ్‌ల్లో 60 సీట్లు ఉన్నాయని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Medical College: త్వరలో పూర్తి కానున్న ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం..

#Tags