Neeraj Chopra: మూడేళ్ల తర్వాత బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా
Sakshi Education
ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ అయిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్ల తర్వాత స్వదేశంలో పోటీపడనున్నాడు.
మే 12 నుంచి 15వ తేదీ వరకు భువనేశ్వర్‌లో జరిగే ఫెడరేషన్ కప్ టోర్నీలో నీరజ్ బరిలోకి దిగుతాడు.
మే 10వ తేదీ దోహాలో జరిగే డైమండ్ లీగ్ మీట్‌తో నీరజ్ కొత్త సీజన్‌ను మొదలు పెట్టనున్నాడు. డైమండ్ లీగ్ మీట్ ముగిశాక అతను నేరుగా దోహా నుంచి భారత్ చేరుకుంటాడు. చివరిసారి నీరజ్ భారత గడ్డపై 2021 మార్చి 17న జరిగిన ఫెడరేషన్ కప్‌లో పోటీపడి స్వర్ణ పతకం నెగ్గాడు.
ICC Rankings: వన్డే, టీ20ల్లో భారత్ నంబర్ 1.. టెస్టుల్లో ఎన్నో స్థానంలో ఉందంటే..
Published date : 09 May 2024 05:14PM