Polytechnic Admissions: పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు తేదీ ఇదే..
ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రవేశం పొందే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు వర్తించవు. పూర్తిస్థాయి ఫీజును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్, శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్, సీతంపేట మోడల్ పాలిటెక్నిక్(ఎస్టీ) కళాశాలలతో పాటు ఐతం, శ్రీవేంకటేశ్వరా, శివానీ, నారాయణ, టీవీఆర్ ప్రైవేట్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Andhra Pradesh: సీఎం జగన్ కు చోడవరం ప్రజల క్షీరాభిషేకాలు, కృతజ్ఞతలు... కారణం?
ప్రైవేట్ కళాశాలల్లో ఖాళీ సీట్లు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం పరిమితంగానే ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్ల నిర్వహణలో పాలిసెట్ రాసిన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రవేశాల సమన్వయకర్త, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గురుగుబెల్లి దామోదర్‌రావు చెప్పారు.
చదవండి: career after polytechnic: పాలిటెక్నిక్‌తో.. అద్భుత అవకాశాలు