Skip to main content

AP Polycet Hall Tickets Released: ఏపీ పాలీసెట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

AP Polyset 2024 Hall Ticket  Download Hall Ticket from AP State Board of Technical Education  AP Polycet Hall Tickets Released  Andhra Pradesh Polytechnic College Admission

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఏపీ పాలీసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ స్టేట్‌ బోర్డ్ ఆఫ్‌ టెక్నికల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ లేదా మొభైల్‌ నెంబర్‌ లేదా పుట్టినరోజు వివరాలతో హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

https://polycetap.nic.in/ నుంచి హాల్‌టికెట్స్‌ను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్‌ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఏప్రిల్ 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పాలీసెట్‌ 2024 పరీక్ష నిర్వహించనున్నారు.

AP POLYCET 2024 Hall Ticket.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

  • ముందుగా polycetap.nic.in. వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి. 
  • హాల్‌టికెట్‌ అని కనిపిస్తున్న లింక్‌పై క్లిక్‌చేయండి. 
  • రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టినరోజు వివరాలను ఎంట్రీ చేయండి. 
  • స్క్రీన్‌పై అడ్మిట్‌ కార్డు/హాల్‌టికెట్‌ కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
Published date : 18 Apr 2024 03:26PM

Photo Stories