GPAT Notification 2024: జీప్యాట్–2024 నోటిఫికేషన్ విడుదల.. స్కోర్‌తో ఎం.ఫార్మసీలో ప్రవేశం..!
సాక్షి ఎడ్యుకేషన్: దేశంలో విస్తరిస్తూ యువతకు అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో కీలకమైంది.. ఫార్మాస్యూటికల్స్! ఈ రంగంలో ప్రయోగాలు, పరిశోధనలు, సరికొత్త ఔషధాల ఆవిష్కరణలకు ఎంతో అవకాశముంది. అందుకే ఫార్మసీలో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఫార్మా సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫార్మసీ పీజీలో చేరాలనుకునే వారికి చక్కటి మార్గంగా నిలుస్తోంది.. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్)! ఈ టెస్ట్ స్కోర్‌తో దేశంలోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీల్లో.. ఎం ఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. తాజాగా జీప్యాట్–2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఈ పరీక్షకు దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు తదితర వివరాలు..
బీ ఫార్మసీ విద్యార్థులు.. జీప్యాట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎం.ఫార్మసీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం జీప్యాట్ స్కోర్ ఆధారంగా వేయికిపైగా ఇన్‌స్టిట్యూట్స్ అడ్మిషన్ కల్పిస్తున్నాయి. జీప్యాట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఆ స్కోర్ కార్డ్ ఆధారంగా.. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Chamoli-Pithorgarh Road: దగ్గరకానున్న చైనా సరిహద్దు.. 500 కి.మీ. నుంచి 80 కి.మీ.కు తగ్గనున్న రోడ్డు..
నిర్వహణ ఎన్‌బీఈఎంఎస్
గత ఏడాది వరకు జీప్యాట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేది. తాజాగా ఈ ఏడాది నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్).. జీప్యాట్ నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. అదేవిధంగా ఫార్మసీ విద్య నిర్వహణ బాధ్యతలను ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కల్పించారు.
అర్హతలు
జీప్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు నాలుగేళ్ల బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. 2024, 2025లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్/బీఈ(ఫార్మాస్యుటిల్ అండ్ ఫైన్ కెమికల్ టెక్నాలజీ) విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులే.
CISEC Results 2024 : ఐసీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
నైపర్ జేఈఈకి మార్గం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) క్యాంపస్‌లకు దేశంలో ఫార్మసీ విద్యను అందించడంలో ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌గా గుర్తింపు ఉంది. వీటిల్లో ప్రవేశానికి నిర్వహించే నైపర్–జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(నైపర్ –జేఈఈ)కు అర్హతగా జీప్యాట్ ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో ఫార్మసీ కళాశాలల్లో ఎం.ఫార్మసీ సీట్ల భర్తీలో ముందుగా జీప్యాట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ స్కోర్ ద్వారా సీట్లు భర్తీ అయిన తర్వాత మిగిలిన సీట్లనే పీజీఈసెట్‌లో ర్యాంకు సాధించిన వారికి కేటాయిస్తారు.
రెండేళ్లపాటు స్కాలర్‌షిప్
జీప్యాట్ స్కోర్ ఆధారంగా రెండేళ్ల ఎం.ఫార్మసీలో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తారు. విద్యార్థులు పుస్తకాలు, ట్యూషన్ ఫీజు, విద్యాభ్యాసానికి సంబంధించిన ఇతర వనరులు సమకూర్చుకునేందుకు ఈ స్కాలర్‌షిప్ సదుపాయం ఉపయోగపడుతుంది.
ICAR-IARI Recruitment: న్యూఢిల్లీలోని ఐకార్–ఐఏఆర్‌ఐలో 15 పోస్టులు.. దరఖాస్తులకు ఇదే చివరి తేదీ!
నాలుగు విభాగాలు.. 500 మార్కులు
జీప్యాట్ పరీక్షను మొత్తం నాలుగు విభాగాల్లో 500 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో ఫార్మాస్యుటికల్ కెమిస్ట్రీ, అనుబంధ సబ్జెక్ట్‌లు 38 ప్రశ్నలు–152 మార్కులు, ఫార్మాస్యుటిక్స్ 38 ప్రశ్నలు–152 మార్కులు, ఫార్మకోగ్నసీ 10 ప్రశ్నలు–40 మార్కులు,ఫార్మకాలజీ28 ప్రశ్నలు–112 మార్కులు, ఇతర సబ్జెక్టులు 11 ప్రశ్నలు–44 మార్కులకు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది.పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. నెగెటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 8
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: 2024, మే 11 – మే 14
- అడ్మిట్ కార్డ్ జారీ: 2024, జూన్ 3
- జీప్యాట్ పరీక్ష తేదీ: 2024, జూన్ 8
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://natboard.edu.in, https://www.pci.nic.in
Diploma Courses: టీటీడీ ఆధ్వర్యంలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాలు.. ఈ కళాశాలలోనే..!
బెస్ట్ స్కోర్‌కు.. మార్గమిదే
ఫార్మకోగ్నసీ
ఇది పూర్తిగా థియరీతో కూడిన విభాగం. కాబట్టి అభ్యర్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా చదివి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఆయా ఔషధాలకు సంబంధించిన భావనలు, విధానాలు, ప్రభావాలు, ఉపయోగాల గురించి అధ్యయనం చేయాలి. ముఖ్యంగా.. గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్, వాలటైల్ ఆయిల్స్, రెసిన్స్, టానిన్స్, కార్బొహైడ్రేట్స్, టిష్యూ కల్చర్, హెర్బల్ డ్రగ్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
ఫార్మకాలజీ
అభ్యర్థుల్లో ఎక్కువ మందికి ఫార్మకాలజీ విభాగంపై ఆసక్తి ఉంటుంది. జీప్యాట్‌లో దీనికి అధిక వెయిటేజీ దక్కుతోంది. ఇందులో డ్రగ్ ఇంటరాక్షన్, మెకానిజమ్స్, డ్రగ్స్–సైడ్ ఎఫెక్ట్స్‌ను అధ్యయనం చేయాలి. డ్రగ్స్‌ను సంక్షిప్త నామాల్లో గుర్తుంచుకొనేందుకు డ్రగ్స్ వర్గీకరణ పాఠ్యాంశం ఉపయోగపడుతుంది. అంకాలజీ (కీమోథెరపీ డ్రగ్స్, నూతన టెక్నాలజీలు తదితరం), న్యూరో ఫార్మకాలజీ, అరుదైన వ్యాధులు, కార్డియోవస్కులర్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్ తదితర ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
AP EAPCET 2024 Hall Tickets : రేపే ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్స్ విడుదల.. పరీక్ష షెడ్యూల్ ఇదే
ఫార్మాస్యూటికల్ అనాలసిస్
జీప్యాట్‌లో ఇతర విభాగాలతో పోల్చితే కొంత సులభంగా ఉండే విభాగం.. ఫార్మాస్యూటికల్ అనాలసిస్. దీనికి సంబంధించి భావనలను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వీలైనన్ని ఎక్కువ సమస్యలు సాధించాలి. ఫార్ములాలను నోట్ చేసుకోవాలి. యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్, మాస్ స్పెక్టోస్క్రోపీ, క్రొమాటోగ్రఫీ, పోలరోగ్రఫీ అండ్ పొలారిమెట్రీ, ఫ్లేమ్ ఫోటోమీటర్, కండక్టోమెట్రీ, ఆంపెరోమెట్రీ, పొటెన్షిమోమెట్రీ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ
ఈ విభాగంలో ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. కాన్సెప్టులపై అవగాహనతో సదరు ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా ఈ విభాగంలో కర్బన రసాయన శాస్త్రంపై దృష్టిపెట్టాలి. ఎస్‌ఏఆర్ ఆఫ్ స్టెరాయిడ్స్, నామ్‌నిక్లేచర్ అండ్ కెమికల్ మొయిటీ ఆఫ్ ది మెడికల్ డ్రగ్స్ గురించి అధ్యయనం చేయాలి.
AIAPGET Notification 2024: ఏఐఏపీజీఈటీ–2024 నోటిఫికేషన్ విడుదల.. అర్హులు వీరే..
ఫార్మాస్యుటిక్స్
ఈ విభాగం అధ్యయనాన్ని రసాయనాలు, టాబ్లెట్ల సూత్రీకరణతో మొదలుపెట్టాలి. సూక్ష్మజీవులను హతమార్చే(స్టెరిలైజేషన్) నైపుణ్యాలు, న్యూమరికల్ ప్రాబ్లమ్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. సర్ఫేస్ అండ్ ఇంటర్ ఫేషియల్ ఫినామినా, రియాలజీ, కైనటిక్స్ అండ్ డ్రగ్స్ స్టెబిలిటీ, బయోఫార్మాటిక్స్ అండ్ ఫార్మకోకైనటిక్స్ అంశాలను ప్రత్యేక దృష్టితో చదవాలి. వీటితోపాటు స్పెక్టోస్క్రోపీ–మాస్ స్పెక్టోస్క్రోపీ, యూవీ, ఐఆర్, ఎన్‌ఎంఆర్ స్పెక్టోస్క్రోపీ చాప్టర్లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, షెడ్యూల్స్ ఆఫ్ డ్రగ్స్ చాప్టర్లకు నోట్సు రాసుకోవాలి. జీప్యాట్‌లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సంఖ్య పెరుగుతున్న విషయాన్ని గుర్తించి ఈ తరహా ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా బయో ఫార్మాస్యుటిక్స్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలిగేషన్ మెథడ్, డోస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బాడీ వెయిట్ అండ్ ఏజ్ టాపిక్స్‌పై ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతున్నారు.
కౌన్సెలింగ్ ఆధారంగా ప్రవేశం
జీప్యాట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు సదరు స్కోర్ ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఈ స్కోర్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి నేరుగా సీట్లు భర్తీ చేస్తున్నాయి. మరికొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు మలి దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నాయి.
NEET Scandal: తమ్ముడి ‘నీట్’ రాసేందుకు అన్న చీటింగ్, ఎలా దొరికిపోయాడంటే..
ఎం.ఫార్మసీలో స్పెషలైజేషన్లు
జీప్యాట్ స్కోర్ ఆధారంగా ఎం.ఫార్మసీలో పలు స్పెషలైజేషన్లలో చేరే అవకాశం ఉంది. పీజీలో ఫార్మకాలజీ, ఫార్మాస్యుటిక్స్, టాక్సికాలజీ, ఫార్మా మేనేజ్‌మెంట్, ఫార్మకోగ్నసీ స్పెషలైజేషన్‌లు పూర్తి చేసిన వారికి జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉంది.
వీరు డ్రగ్ డిస్కవరీ సంస్థలు, డ్రగ్ ఫార్ములేషన్ సంస్థలు, బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. జీప్యాట్‌తో పీజీ పూర్తి చేసిన తర్వాత పీహెచ్‌డీలో చేరితే ఉజ్వల కెరీర్ అవకాశాలు లభిస్తాయి.