AP EAPCET 2024 Hall Tickets: ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్స్ విడుదల.. పరీక్ష షెడ్యూల్ ఇదే
ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (ఎంసెట్) ఏపీఈఏపీ హాల్‌టికెట్స్ మే 7న విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.మే 16-23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Sakshi EAPCET & NEET Grand Mock Test 2024 Question Paper with Key: Engineering | Agriculture | NEET
ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహించనుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్,అనుబంద కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024 నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రీక్షలను రెండు షిఫ్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ నిర్వహిస్తారు.